Aham Reboot first glimpse వినూత్న ప్రయోగాత్మక చిత్రంగా అహాం రీబూట్.. అదిరిపోయే పాత్రలో సుమంత్
ఎన్ని సినిమాలు చేస్తున్నామని కాకుండా.. ఎంత క్వాలిటీతో సినిమాలు, విభిన్నమైన పాత్రలు చేస్తున్నామని ఆలోచించే హీరో సుమంత్.. రాశి కంటే వాసి ముఖ్యమనే ఆయన ప్రస్తుతం సాంకేతిక నేపథ్యం, కథాపరంగా పుష్కలంగా విలువలు ఉన్న చిత్రం అహాం రీబూట్‌లో సుమంత్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్నివాయుపుత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం "అహం రీబూట్" సినిమా విడుదల సన్నాహాల్లో ఉంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ గ్లిట్చ్ (ఫస్ట్ గ్లింప్స్) విడుదల చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం జూలై లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

అహాం రీబూట్ ఫస్ట్ గ్లిప్స్ అందర్నీ ఆకట్టుకొంటున్నది. మీ ఆలోచనలు కూడా ప్రసారం అవుతాయి.. అని రేడియో సృష్టికర్త మార్కొని చెప్పిన కొటేషన్ తో ఫస్ట్ గ్లిట్చ్ మొదలైంది. ఇందులో సుమంత్ రేడియో జాకీ (ఆర్జే) నిలయ్ పాత్రలో కనిపిస్తున్నారు. కొంతమంది నన్ను కిడ్నాప్ చేశారు కాపాడమంటూ ఒక యువతి ఆర్జే నిలయ్‌కు ఫోన్ చేస్తుంది. ఇలాగే ప్రమాదంలో ఉన్న చాలా మంది యువతులు కథానాయకుడి సాయాన్ని రేడియో ద్వారా కోరుతుంటారు. మరి వాళ్లను అతను ఎలా కాపాడాడు అనేది ఆసక్తి కరంగా ఉండబోతోంది.
ఆహాం రీబూట్ ప్రయోగాత్మక చిత్రంగా ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఒక యునిక్ కాన్సెప్ట్‌ను థ్రిల్లింగ్‌గా ప్రజెంట్ చేయడం అహం రీబూట్‌కి బలంగా మారుతుంది అని టీమ్ నమ్ముతుంది. హీరో సుమంత్ నటన ప్రత్యేకంగా ఉంటుందని చిత్ర యూనిట్ వెల్లడించింది.
సాంకేతిక నిపుణులు
సంగీతం: శ్రీరామ్ మద్దూరి
సినిమాటోగ్రఫీ: వరుణ్ అంకర్ల
స్క్రిప్ట్: సూపర్ విజన్ - సుమ కార్తికేయ
ప్రొడక్షన్ డిజైన్: ఏఆర్ వంశీ
సౌండ్ డిజైన్: నాగార్జున తాళ్లపల్లి
పీఆర్వో: జీఎస్కే మీడియా
నిర్మాతలు: రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు
రచన దర్శకత్వం: ప్రశాంత్ సాగర్ అట్లూరి.


Click it and Unblock the Notifications











