ఉపాసన సంపద ఎన్ని వేల కోట్లు? రాంచరణ్ ఆస్తులు ఎన్ని కోట్లు?

Ram Charan-Upasana Net Worth: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) నటించిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమా'పెద్ది' (Peddi). ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో రామ్ చరణ్ పేరు మరోసారి దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. సినిమా ప్రమోషన్స్, అడ్వాన్స్ బుకింగ్స్, రికార్డు స్థాయి అంచనాల మధ్య చరణ్ కెరీర్‌తో పాటు ఆయన వ్యక్తిగత జీవితం, వ్యాపార సామ్రాజ్యం, ఆస్తులు, కుటుంబ నేపథ్యం వంటివి చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా భార్య ఉపాసనతో కలిసి ఆయన నిర్మించుకున్న వేల కోట్ల రూపాయల సంపద, వ్యాపార పెట్టుబడులు, లగ్జరీ లైఫ్‌స్టైల్‌పై అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్- ఉపాసన దంపతుల ఆస్తుల విలువ ఎంత? వారి వ్యాపారాలు ఏంటి? అనే విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read
తెలంగాణలో పెద్ది టికెట్‌ ధరల పెంపు.. స్పెషల్ షో టికెట్ రేటు ఎంతంటే?
తెలంగాణలో పెద్ది టికెట్‌ ధరల పెంపు.. స్పెషల్ షో టికెట్ రేటు ఎంతంటే?

తెలుగు చిత్ర సీమలో అత్యంత ప్రభావవంతమైన దంపతుల జాబితాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల జంట ఒకరు. ఒకవైపు సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో రామ్ చరణ్ ఒకరైతే, మరోవైపు దేశంలోని అతిపెద్ద ఆరోగ్య రంగ వ్యాపార కుటుంబాల్లో ఒకటైన అపోలో గ్రూప్ వారసురాలు ఉపాసన.

Recommended For You
Prabhas: ఏం ఉన్నాడ్రా బాబు.. ప్రభాస్ న్యూలుక్ సూపర్.. ఫ్యాన్స్ ఫిదా..
Prabhas: ఏం ఉన్నాడ్రా బాబు.. ప్రభాస్ న్యూలుక్ సూపర్.. ఫ్యాన్స్ ఫిదా..
Ram Charan-Upasana Net Worth Sparks Huge Buzz

ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా చిరుత సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత మగధీర, రంగస్థలం, ధృవ, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ముఖ్యంగా 'ఆర్ఆర్ఆర్' విజయం తర్వాత ఆయన మార్కెట్ భారీగా పెరిగింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మీడియా కథనాల ప్రకారం.. రామ్ చరణ్ వ్యక్తిగత ఆస్తుల విలువ సుమారు రూ.1300 కోట్ల నుంచి రూ.1400 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

You May Also Like
Peddi: రామ్ చరణ్ మూవీని వదులుకున్న సూర్య హీరోయిన్.. కారణం వింటే షాకే!
Peddi: రామ్ చరణ్ మూవీని వదులుకున్న సూర్య హీరోయిన్.. కారణం వింటే షాకే!

సినిమా ఆదాయం మాత్రమే కాకుండా పలు వ్యాపారాలు, పెట్టుబడులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు కూడా రామ్ చరణ్ సంపదలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒక్కో ప్రకటనకు రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. సినిమాలతో పాటు వ్యాపార రంగంలో కూడా రామ్ చరణ్ తనదైన ముద్ర వేశారు. 2016లో స్థాపించిన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ద్వారా 'సైరా నరసింహారెడ్డి', 'ఆచార్య' వంటి సినిమాను నిర్మించారు. అలాగే విక్రమ్ రెడ్డితో కలిసి 'వి మెగా పిక్చర్స్' అనే నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు.

దీపికాకు జాన్వీ స్ట్రాంగ్ కౌంటర్? కల్కీ వివాదం మళ్లీ తెరపైకి!
దీపికాకు జాన్వీ స్ట్రాంగ్ కౌంటర్? కల్కీ వివాదం మళ్లీ తెరపైకి!

అంతేకాదు, రామ్ చరణ్‌కు విమానయాన రంగంలో కూడా పెట్టుబడులు ఉన్నాయి. ఒకప్పుడు ట్రూజెట్ ఎయిర్‌లైన్స్‌లో భాగస్వామిగా ఉన్నారు. అలాగే హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ యజమానిగా, డెవిల్స్ సర్క్యూట్ వంటి స్పోర్ట్స్ వెంచర్లలో కూడా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. లగ్జరీ లైఫ్‌స్టైల్ విషయానికి వస్తే.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఆయనకు సుమారు రూ.30 కోట్ల విలువైన విలాసవంతమైన భవనం ఉంది. దీనితో పాటు ఫార్మ్‌హౌస్‌లు, కమర్షియల్ ప్రాపర్టీలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

ఆ మాట ఎప్పటికీ మర్చిపోలేను.. చిరంజీవిపై నాని ఎమోషనల్
ఆ మాట ఎప్పటికీ మర్చిపోలేను.. చిరంజీవిపై నాని ఎమోషనల్

కార్ల కలెక్షన్ విషయానికి వస్తే, రోల్స్ రాయిస్ ఫాంటమ్, రోల్స్ రాయిస్ స్పెక్టర్, ఆస్టన్ మార్టిన్ వాంటేజ్, బీఎండబ్ల్యూ 7 సిరీస్, మెర్సిడెస్ మేబాక్, ఆడి క్యూ7, రేంజ్ రోవర్ వోగ్ వంటి ఖరీదైన కార్లు ఆయన గ్యారేజ్‌లో ఉన్నాయి.

Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంటలు బాలు రెమ్యూనరేషన్.. రోజుకి ఇంత పేమెంట్!
Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంటలు బాలు రెమ్యూనరేషన్.. రోజుకి ఇంత పేమెంట్!

మరోవైపు ఉపాసన కొణిదెల కేవలం స్టార్ హీరో భార్య మాత్రమే కాదు, ప్రముఖ వ్యాపారవేత్త కూడా. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి మనవరాలు. దాదాపు 77,000 వేల కోట్ల విలువైన అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌కు వారసురాలు. వ్యాపార రంగంలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న ఉపాసన ప్రస్తుతం అపోలో సంస్థ సామాజిక సేవా కార్యక్రమాలను పర్యవేక్షించే విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా డిజిటల్ హెల్త్‌కేర్ రంగంలో కీలక సంస్థగా ఎదిగిన అపోలో 24/7 బోర్డు సభ్యురాలిగా కూడా కొనసాగుతున్నారు.

మీనా చేసిన పెద్ద తప్పు అదేనా? నాగార్జునతో ఆ ఛాన్స్ వదులుకొన్నదా?
మీనా చేసిన పెద్ద తప్పు అదేనా? నాగార్జునతో ఆ ఛాన్స్ వదులుకొన్నదా?

ఇక కార్పొరేట్ రంగంలో కూడా ఉపాసన ప్రభావం గణనీయంగా ఉంది. ప్రముఖ లైఫ్ సైన్సెస్ సంస్థ జైడస్ గ్రూప్‌లో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య రంగం, డిజిటల్ సేవలు, సామాజిక కార్యక్రమాలు వంటి పలు విభాగాల్లో ఆమె చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఇలా రామ్ చరణ్-ఉపాసన దంపతులు దేశంలోని అత్యంత ధనిక సెలబ్రిటీ జంటల్లో ఒకరిగా గుర్తింపు పొందుతున్నారు. ఒకవైపు సినిమా రంగంలో రామ్ చరణ్ విజయాలు, మరోవైపు వ్యాపార రంగంలో ఉపాసన ప్రభావం ఈ కుటుంబాన్ని మరింత శక్తివంతంగా మార్చాయి.

పెళ్లి తర్వాతే అన్నీ ఇస్తా.. ఆటో రాంప్రసాద్‌కు జబర్దస్త్ బ్యూటీ షాక్!
పెళ్లి తర్వాతే అన్నీ ఇస్తా.. ఆటో రాంప్రసాద్‌కు జబర్దస్త్ బ్యూటీ షాక్!

ఇదిలా ఉంటే, రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విజయంతో రామ్ చరణ్ మార్కెట్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read more about: upasana konidela ram charan peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X