Aishwarya-Abhishek Divorce : ఐశ్వర్య, అభిషేక్ విడాకులు .. కొత్త ట్విస్ట్ ఇచ్చిన స్టార్ కపుల్
ఈ మధ్యకాలంలో మన తెలుగు చిత్ర పరిశ్రమ సహా తమిళ్ , హిందీ ఇండస్ట్రీకి చెందిన పెళ్లయిన జంటలు విడిపోవడం అనేది ఎక్కువగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు నుంచి కొందరు తమిళ్ నుంచి అయితే ధనుష్, హిందీ సినిమాలో ఆ మధ్య అమీర్ ఖాన్ ఇటీవల ఏ ఆర్ రెహమాన్ ఇలా చాలా మంది తమ వివాహ బంధాలకి ముగింపు పలికారు.
కాగా ఇలా కొంచెం కాంట్రవర్సియల్‌గా పలు గాసిప్స్ కూడా మొదలు కాగా ఆ మధ్య బాలీవుడ్‌లో బాగా వినిపించిన రూమర్స్‌లో బిగ్ బి అమితాబ్ కుటుంబంలోని కలహాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా అనంత్ అంబానీ పెళ్లిలో జరిగిన కొన్ని ఘటనలు చూసి చిత్ర పరిశ్రమ షాక్ అయ్యింది. కాగా ఆ వేడుకల్లో అమితాబ్ కుటుంబానికి దూరంగా ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కనిపించడంతో హిందీ ఇండస్ట్రీ సహా సౌత్ సినీ వర్గాల్లో కూడా చర్చకి దారి తీసింది.

ఇక అక్కడ నుంచి ఆ ఇద్దరూ దాదాపు విడిపోయారు అనే వార్తలు కూడా హిందీ నెటిజన్స్ సర్క్యులేట్ చేసేసారు. కానీ మధ్యలో ఇద్దరూ విడిపోవడం లేదు అని పలు ఫొటోస్ ఐతే కలిసి ఉన్నవి బయటకి వచ్చాయి. కానీ అప్పటికీ కొందరిలో నమ్మకం కలగలేదు కానీ ఇపుడు మాత్రం ఈ ఇద్దరూ విడాకులు తీసుకుంటారు అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని నమ్మి తీరాల్సిందే అంటూ బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
లేటెస్ట్ గా జూనియర్ బచ్చన్ అదే అభిషేక్ బచ్చన్ అండ్ ఐశ్వర్య రాయ్ లు ఇద్దరూ కలిసి ఓ పెళ్ళికి హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే పెళ్ళికి ఇద్దరూ కలిసి హాజరు కాగా ఇద్దరు కలిసి కనిపించిన పలు హ్యాపీ మూమెంట్ ఫోటోలు ఇపుడు వైరల్ అవుతున్నాయి. వీటిలో అభిషేక్ - ఐశ్వర్య ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారు.

వీరిని చూస్తే ఎక్కడా విడిపోదాం అనే ఛాయలు కూడా కనిపించడం లేదు. సో ఈ రకంగా తమ విడాకులు అంటూ వస్తున్న ఆధారం లేని రూమర్స్ కి ఇద్దరు కలిసే కావాలని చెక్ పెట్టినట్టుగా బాలీవుడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇలా మొత్తానికి వీరి విడాకుల మిస్టరీకి దాదాపు శుభం కార్డు పడ్డట్టే అనుకోవాలి.
ఇక అభిషేక్ బచ్చన్ హిందీలో పలు చిత్రాలు చేస్తుండగా ఐశ్వర్య రాయ్ మాత్రం తమిళ్ లో పొన్నియిన్ సెల్వన్ చిత్రాల్లో చివరగా కనిపించింది. మళ్ళీ చేస్తే మణిరత్నం సినిమాలు మాత్రమే చేస్తాను అన్నట్టుగా కూడా ఐష్ డిసైడ్ అయ్యి ఉందట. ఇక వీరి ఇంటి పెద్ద బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ రీసెంట్ గా భారీ పాన్ ఇండియా హిట్ చిత్రం "కల్కి 2898 ఎడి" లో ప్రభాస్ తో పాటుగా సూపర్ రోల్ చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











