twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సత్యదేవ్ సినిమాలో ఐశ్వర్య: ‘గాడ్సే’ కోసం టాలెంటెడ్ బ్యూటీని దింపారుగా

    |

    విభిన్నమైన చిత్రాలతో తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ సెన్సేషన్ సత్యదేవ్. కెరీర్ ఆరంభంలో సపోర్టింగ్ ఆర్టిస్టుగా నటించిన అతడు.. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'జ్యోతి లక్ష్మీ' అనే మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. ఇందులో ఛార్మీ తర్వాత అంతటి గుర్తింపును తెచ్చుకుని సత్తా చాటాడు. అప్పటి నుంచి హీరోగా, సహాయ నటుడిగా ద్విపాత్రాభినయం చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ పలు చిత్రాల్లో అత్యుత్తమ నటనను కనబరిచాడు. దీంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

    సరికొత్త కథాంశాలతో సినిమాలు చేస్తున్న సత్యదేవ్.. ప్రస్తుతం 'బ్లఫ్ మాస్టర్' దర్శకుడు గోపీ గణేష్‌తో మరో సినిమా చేయబోతున్నాడు. 'గాడ్సే' అనే వివాదాస్పదమైన టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను సీకే స్క్రిన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇటీవలే అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. అందులో సత్యదేవ్ వైల్డ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. అతడి చేతి దగ్గర మందు గ్లాసుతో పాటు వెనకాల పెద్ద గన్ కూడా ఉంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.

    Aishwarya Lekshmi Female Lead for Satyadevs GODSE

    యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాలో మలయాళ భామ ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు హీరో సత్యదేవ్ ఆమెకు స్వాగతం పలుకుతూ ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టాడు. అంతేకాదు, ఆమె తెలుగు సినీ భవిష్యత్ బాగుండాలని ఆకాంక్షించాడు. ఇదిలా ఉండగా, గత ఏడాది 'ఉమామహేశ్వర ఉగ్ర రూపశ్య'తో భారీ విజయాన్ని అందుకున్నాడు సత్యదేవ్. ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన రావడంతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ తర్వాత అతడిని సినీ పెద్దలంతా అభినందించిన విషయం తెలిసిందే.

    English summary
    Satyadev Kancharana, known professionally as Satya Dev, is an Indian actor who primarily works in Telugu cinema. Starting with supporting roles, Satyadev established himself as a leading actor. He is better known for his performances in the movies such as Jyothi Lakshmi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X