ఐశ్వర్యరాయ్ భావోద్వేగం.. సుశాంత్ సింగ్‌కు శ్రద్దాంజలి ఘటిస్తూ..
యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో దేశవ్యాప్తంగా సినీ అభిమానులు, ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. జూన్ 14న బంద్రాలోని తన నివాసంలో ఉరివేసుకొని మరణించడం బాలీవుడ్‌ను కుదిపేసింది. గత ఆర్నెళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్న ఆయన తీవ్రమైన నిర్ణయంతో జీవితాన్ని అర్ధాంతరంగా జీవితాన్ని చాలించడం పలువురికి గుండె కోతగా మిగిలింది. ఈ క్రమంలో పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు శ్రద్దాంజలి ఘటిస్తూ సంతాపం వ్యక్తం చేశారు.
తాజాగా ఐశ్వర్యరాయ్ భావోద్వేగంగా శ్రద్దాంజలి ఘటించి సంతాపం వ్యక్తం చేశారు. ఐశ్వర్య తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేసి.. అతడి ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని ఎమోషనల్ అయ్యారు.

ఇక కుటుంబ సభ్యులు పాట్నాలోని గంగా నదిలో సుశాంత్ సింగ్ ఆస్థికలను నిమజ్జనం చేశారు. ముంబైలో అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబ సభ్యులు సుశాంత్ ఆస్థికలు తీసుకొని బుధవారం పాట్నాకు చేరుకొన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో సుశాంత్ తండ్రి కేకే సింగ్, సోదరి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆస్థికల నిమజ్జనం సందర్బంగా కుటుంబ సభ్యుల భావోద్వేగానికి గురికావడంతో పరిస్థితి కాసేపు గంభీరంగా మారిందని తెలిసింది.
కాగా, సుశాంత్ సూసైడ్ కేసులో ముంబై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటి వరకు దాదాపు 19 మందిని ప్రశ్నించినట్టు గురువారం సాయంత్రం పోలీసులు మీడియాకు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











