మణిరత్నం చిత్రంలో ఐశ్వర్యారాయ్.. మరో స్టార్ హీరోలు కూడా!
ప్రముఖ దర్శకుడు మణిరత్నం మరో ప్రతిష్టాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. పొన్నియన్ సెల్వం అనే చిత్రాన్ని త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్ బచ్చన్, కీర్తీ సురేష్, జయం రవి తదితరులు నటించనున్నారు. గతంలో విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్ బచ్చన్‌తో రావణ్, గురు, చెలియా చిత్రాల్లో పనిచేసిన సంగతి తెలిసిందే.
కార్తీ, విక్రమ్, జయం రవి ఎంపిక పూర్తయింది. డిసెంబర్‌లో జరిగే షూట్‌కు హాజరవుతారు. విక్రమ్ తన సినిమాలను డిసెంబర్‌లోపు పూర్తి చేసుకొనేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఇతర నటీనటుల వివరాలను వెల్లడిస్తారు.

ఈ చిత్రం ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. రాజ రాజ చోళగా ప్రసిద్దికెక్కిన అరుల్మ్‌జివర్మన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
mani ratnam ponniyin selvan chiyaan vikram karthi aishwarya rai bachchan keerthy suresh మణిరత్నం చియాన్ విక్రమ్ కార్తీ ఐశ్వర్య రాయ్ బచ్చన్ కీర్తీ సురేష్


Click it and Unblock the Notifications