Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
డైరెక్షన్ చేయడానికి నేను రెడీ.. అది ఎప్పుడంటే.. ఐశ్వర్యరాయ్
వయసు మీద పడుతున్న హీరోయిన్లు మరో కెరీర్‌ను ఎంచుకొనే క్రమంలో కొందరు సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇదే ప్రశ్నను అందాల తార ఐశ్వర్యరాయ్‌ని అడిగితే అవుననే సమాధానం చెప్పారు. చాలా రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. చాలా మంది ప్రొడక్షన్లోకి రమ్మని అడుగుతున్నారు. కానీ నాకు దానిపై ఇంకా పూర్తిగా అవగాహన కలుగలేదు అని ఐశ్వర్యరాయ్ చెప్పారు.
ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నాను. నటనకు నేను కట్టుబడి ఉన్నాను. ప్రస్తుతం నటనకే పరిమితం అయ్యాను. ఇంకా మరో రంగంవైపు ఆలోచించలేదు. అని తెలిపారు.
అయితే డైరెక్షన్ చేయాలనే ఆలోచన ఉంది. ఏదో ఒకరోజు సినిమాకు డైరెక్షన్ చేస్తాను. అది ఎప్పుడనేది ఇంకా నిర్ణయించుకోలేదు. కాలమే దానికి సమాధానం చెబుతుంది. డైరెక్షన్ చేయాలనే ఆలోచన చాలా సీరియస్‌గానే సాగుతున్నది. మంచి కథ కోసం నిర్మాతగా, లేదా దర్శకుడిగా మారడంలో తప్పేమీ లేదు అని ఐశ్వర్యరాయ్ అన్నారు.