తమిళంలో అంధాదూన్ రీమేక్.. టబు పాత్రలో ఐశ్వర్యరాయ్
హిందీలో విమర్శకుల ప్రశంసలతోపాటు విశేషంగా ప్రేక్షకాదరణ పొందిన అంధాదూన్ చిత్రం పలు భాషల్లోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఇప్పటికే అంధాదూన్ చిత్రం రూపొందుతుండగా.. ఈ సినిమా తమిళంలో కూడా పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. తమిళ రీమేక్‌లో నటించే హీరో, దర్శకుడి పేర్లను అధికారికంగా చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
అంధాదూన్ చిత్ర రీమేక్‌లో హీరోగా ప్రశాంత్ నటిస్తుండగా, ఫెడ్రిక్ జేజే దర్శకుడిగా వ్యవహరించబోతున్నారు. ఈ చిత్రాన్ని ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్, స్టార్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రశాంత్ గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇక ఫెడ్రిక్ జేజే తాజాగా జ్యోతిక నటించిన పోన్‌మంగల్ వంధాల్‌కు దర్శకత్వం వహించారు.

ఇక హిందీలో హీరోగా ఆయుష్మాన్ ఖురానా నటించగా, కీలక పాత్రల్లో టబు, రాధిక ఆప్టే నటిస్తున్నారు. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు.
కాగా, తమిళ రీమేక్‌లో త్రిషా, అండ్రియా, సిమ్రాన్, అనుష్క శెట్టి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే మరో పాత్రలో అంటే టబు పాత్రను ఐశ్వర్యరాయ్ పోషిస్తున్నట్టు సమాచారం. అయితే అధికారికంగా ఎలాంటి వార్తలు బయటకు రాలేకపోవడంతో ఐశ్వర్య నటిస్తుందా అనే విషయంపై క్లారిటీ లేదు.


Click it and Unblock the Notifications











