యంగ్ హీరోయిన్‌కు పెళ్లి.. మా ఆయన గొప్ప ప్రేమికుడంటూ పోస్ట్
విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరమే లేదు. దక్షిణాది సరిహద్దులను చెరిపి బాలీవుడ్‌కు తన క్రేజ్‌ను చూపించిన హీరో విజయ్ దేవరకొండ. కనీసం డబ్బింగ్ చిత్రాలతోనైనా హిందీ ప్రేక్షకులను పలకరించని విజయ్.. అక్కడ క్రేజియస్ట్ స్టార్‌గా దూసుకుపోతున్నాడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి చిత్రాలు విజయ్ స్టేటస్‌ను అమాంతం పెంచేశాయి.

సినిమాలు ఫెయిల్ అయినా..
ఏ హీరో సినిమా అయినా ఫెయిల్ అయితే అంతే సంగతులు. మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే అందరూ పట్టించుకుంటారు. ఒక్క పరాజయం పలకరించినా అందరూ మొహం తిప్పేస్తారు. అయితే విజయ్ దేవరకొండ విషయంలో మాత్రం అది కుదరదు. ఎందుకంటే అతనికి కేవలం సినిమాల వల్లే క్రేజ్ రాలేదు. అతని పద్దతి, వ్యహరించే తీరు, కనిపించే విధానం ఇలా, ప్రత్యేకమైన యాటిట్యూడ్ ఇలా అన్ని విజయ్‌కు ఫాలోయింగ్‌ను పెంచేశాయి.

ప్రేమ కథలకు కేరాఫ్..
భగ్న ప్రేమికుడైనా, ప్రేయసికి భయపడే లవర్ అయినా, విపరీతమైన కోపంతో ఊగిపోయే యువకుడైనా అది విజయ్ దేవరకొండ చేస్తేనే అందంగా ఉంటుందని నిరూపించుకున్నాడు. ఇప్పటి వరకు చేసిన కథలన్నీ యూత్‌ను టార్గెట్ చేసినవే. అర్జున్ రెడ్డి, గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్నీ యూత్‌ను తెగ ఆకట్టుకున్నాయి. తాజాగా మరో లవ్ ఎంటర్‌టైనర్‌తో మన ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు.

పోస్టర్ రిలీజ్..
విజయ్ దేవరకొండ నుంచి త్వరలో రాబోతోన్న చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో తన భార్య సువర్ణ(ఐశ్వర్యా రాజేశ్)ను ఘాడంగా హత్తుకున్న శీనయ్య (విజయ్ దేవరకొండ) కనిపిస్తున్నారు.
మా ఆయనే అంటూ పరిచయం..
ఈ పోస్టర్‌ను ఐశ్వర్యా రాజేశ్ పోస్ట్ చేస్తూ.. మా ఆయనే వరల్డ్ ఫేమస్ లవర్.. మా శీనయ్యను ప్రేమికుల రోజు కలుద్దురు.. ఫిబ్రవరి 14న వస్తున్నాము.. ఇంకొ ముచ్చట.. జనవరి 3న టీజర్ అంటూ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. ఈ మధ్యే కౌసల్యా కృష్ణమూర్తి, మిస్ మ్యాచ్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. మరోసారి ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించేలానే కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











