ఫ్రెండ్ కూతురితో జతకడుతున్న వెంకటేష్.. సగం ఏజ్‌ ఉన్న అమ్మాయితో రొమాన్సా?

తెలుగు సినిమా పరిశ్రమలో మాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అభిమానులుగా మార్చుకున్న హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఇదే క్లీన్ స్టార్‌డమ్‌తో సుదీర్ఘ కాలంగా సత్తా చాటుతోన్న ఆయన.. ఈ మధ్య కాస్త స్పీడ్ తగ్గించారు. అలా స్లోగానే ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. ఇలా సంక్రాంతి 'సైంధవ్'గా వచ్చి నిరాశ పరిచారు.

చాలా గ్యాప్ తర్వాత సరైన హిట్ కొట్టాలన్న కసితో ఉన్న విక్టరీ వెంకటేష్ ఇప్పుడు అనిల్ రావిపూడితో సినిమాను చేయబోతున్నారు. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌ కావడంతో ఈ సినిమా అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని గ్రాండ్‌గా మొదలు పెట్టేందుకు చిత్ర యూనిట్ ప్లాన్లు చేసుకుంటోంది.

Aishwarya Rajesh Key Role In Anil Ravipudi and Venkatesh Movie

విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి రూపొందించబోయే సినిమాకు జూలై 3వ తేదీ నుంచే అధికారికంగా మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే దీనిపై ప్రకటన కూడా వచ్చేసింది. ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్‌ను జూలై రెండో వారం నుంచి స్టార్ట్ చేస్తారట. అంతేకాదు, వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేసుకుని.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం పోలీస్ అధికారి స్టోరీతో రాబోతుందని ఇప్పటికే న్యూస్ లీకైంది. ఇందులో హీరో మాజీ ప్రేయసి, భార్య మధ్య జరిగే సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయని అంటున్నారు. ఈ రెండు పాత్రల్లో ఒక దాని కోసం మీనాక్షి చౌదరిని ఫైనల్ చేశారు. మరో హీరోయిన్ గురించి తాజాగా అధికారిక ప్రకటన వచ్చింది.

Aishwarya Rajesh Key Role In Anil Ravipudi and Venkatesh Movie

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంలో రెండో హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేష్‌ను చిత్ర యూనిట్ ఎంపిక చేసింది. ఈ విషయాన్ని కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇక, ఇందులో ఆమె హీరో భార్యగా నటిస్తున్నట్లు తెలిసింది. దీంతో తన ఫ్రెండ్ (సహచర నటుడు రాజేష్) కూతురితో వెంకటేష్ జతకడుతున్నట్లు అయింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదిలా ఉండగా.. దగ్గుబాటి వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి 'సంక్రాంతికి వస్తున్నాం' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో నటించే నటీనటులు, టెక్నీషియన్ల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X