పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏ మాత్రం డిసప్పాయింట్ అవ్వరు: ఐశ్వర్య రాజేష్
'ఆటగదరా శివ' మూవీ ఫేం ఉదయ్ శంకర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'మిస్ మ్యాచ్'. అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి సంస్థపై జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటిస్తుండగా ఎన్ వి. నిర్మల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ... ఈ సినిమా చేయాలని అడిగినపుడు నా వద్ద డేట్స్ లేవు, తమిళంలో చాలా సినిమాలు ఉన్నాయి. నాకు స్క్రిప్టు చెప్పి అతి కష్టం మీద ఒప్పించారని తెలిపారు.

స్క్రిప్టు ఎంపిక విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. విభిన్నంగా ఉండే కథలనే ఎంచుకుంటాను. నా గత సినిమాలు చూసుకుంటే 'కాక ముట్టై'లో స్లమ్ ఏరియాలో ఇద్దరి పిల్లల తల్లిగా నటించాను. ఈ సినిమాలో నా పాత్ర గురించి చెప్పినపుడు ఇప్పటి వరకు నేను చేసిన రోల్స్ కంటే భిన్నంగా ఉంది. ఇందులో నాది రెజ్లర్ పాత్ర. నాకు రెజ్లింగ్ అస్సలు రాదు. తమిళంలో ఓ సినిమాలో క్రికెట్ ప్లేయర్ గా చేశాను. అది తెలుగులో 'కౌశల్య కృష్ణమూర్తి'గా రాబోతోంది. 6 నెలలు క్రికెట్ నేర్చుకుని చేశాను. రెజ్లింగ్ రాదు కాబట్టి నేర్చుకున్న తర్వాతే చేస్తాను అని చెప్పా. ఊరికే వచ్చి చేస్తే ప్రొఫెషనల్‌గా ఉండదు... ఇందుకు దర్శక నిర్మాతలు కూడా ఒప్పుకోవడంతో సినిమా సైన్ చేశాను.
'మిస్ మ్యాచ్' మూవీకి దర్శకత్వం వహించిన నిర్మల్ కుమార్ అంటే ఏమిటో... ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ రోజు ఈ మూవీ చాలా చిన్న సినిమాగా కనిపించవచ్చు. కానీ నిర్మల్ ఈచిత్రాన్ని చాలా పెద్దగా తీశారు. గ్రాండ్‌గా తీశారు. తొలి ప్రేమ పాటను ఇందులో రీమేక్ చేశాం. సింగిల్ టేక్ లో చేశాం. సింపుల్‌గా కాకుండా చాలా మంది గ్రూప్ డ్యాన్సర్లతో ఒక వింటేజ్ ఫీల్ వచ్చేలా చేశాం. ఈ సాంగ్ చూస్తే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరూ ఫీలవ్వరు. వారిని డిసప్పాయింట్ చేయకుండా చేశాం. ఈ సినిమా కామెడీ, డ్రామా, స్పోర్ట్స్ ఇలా చాలా మంచి విషయాలతో ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని ఐశ్వర్య తెలిపారు.


Click it and Unblock the Notifications











