పెళ్లైన 18ఏళ్లకు బ్రేకప్... 2 ఏళ్లుగా విడిగానే... ఒంటరితనమే బెస్ట్ అంటున్న స్టార్ హీరో భార్య

ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిల్లు ఎంత కామనో అదే సమయంలో విడాకులు తీసుకోవడం అంతే సర్వసాధారమైన సంగతని తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య కాలంలో అవి మరింత ఎక్కువైపోయాయి. కొంతమందేమో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంటే మరి కొంతమంది విడాకుల అంటూ చర్చనీయాంశంగా మారిపోతున్నారు. రీసెంట్​గా ఓ స్టార్ కపుల్ కూడా తమ 18ఏళ్ల బంధానికి స్వస్తి చెబుతూ అభిమానులకు షాక్ ఇచ్చారు. అయితే లీగల్​గా మాత్రం డివొర్స్ తీసుకోలేదు. దీంతో వారు త్వరలోనైనా కలుస్తారేమోనని ఫ్యాన్స్ ఆశించారు. కానీ ఇప్పుడు వారి ఆశలు ఆవిరైపోయాయి.​ దాని గురించే ఈ కథనం..

గతంలో హీరో హీరోయిన్​ సమంత నాగ చైతన్య విడిపోయినప్పుడు అభిమానులు ఏ రేంజ్​లో బాధపడ్డారో తెలిసిన విషయమే. ముఖ్యంగా వారిద్దరి మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే ఎంతో డీప్​గా ఫీల్ అయిపోయారు. మళ్లీ ఆ తర్వాత సూపర్ స్టార్ రజినీ కాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్, ధనుశ్​ విడిపోయినప్పుడు అదే స్థాయిలో అభిమానులు చాలా బాధపడ్డారు. ఎందుకంటే సామ్​- చైతూ ఎప్పటికైనా కలుస్తారనే నమ్మకంతో ఎలా అయితే అభిమానులు బతుకుతున్నారో అలానే ఐశ్వర్య రజనీకాంత్​ - ధనుశ్ కూడా కలుస్తారని అంతా ఆశిస్తున్నారు.

Aishwarya Rajinikanth Emotional Comments on Her Breakup With Star Hero Dhanush News Goes Viral

అయితే ఇప్పుడు తాజాగా ఐశ్వర్య రజనీకాంత్ చేసిన కామెంట్స్ వైరల్​గా మారాయి. ఫ్యాన్స్​ ఆశలపై నీళ్లు చల్లినట్టైంది. ఆమె తాజాగా లాల్ సలామ్ చిత్రం ప్రమోషన్స్​లో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన విడాకుల విషయంపై మాట్లాడుతూ.. దాదాపు రెండేళ్ల నుంచి నేను ఒంటరిగానే జీవిస్తున్నాను. అయితే ఈ ఒంటరితనాన్ని బాగానే ఆస్వాదిస్తున్నాను. ఒంటరిగా ఉండటం వల్ల నాకు తెలిసిన విషయం ఏంటంటే మనం మరింత సురక్షితంగా ఉండగలం.

ఇది నాకు నచ్చింది. నేను నా పిల్లల కోసమే సినిమాల నుంచి విరామం తీసుకున్నాను. పిల్లలు ఎదిగేటప్పుడు వారితో ఉండాలని ఆశిస్తున్నాను. కానీ అది కుదరలేదు. అని ఐశ్వర్య రజినీకాంత్ పేర్కొంది. ఇక ఈ కామెంట్స్ విన్న అభిమానులు మళ్లీ ఫీల్ అవ్వడం ప్రారంభించారు. ఎందుకంటే చాలా మంది ధనుశ్​ - ఐశ్వర్య తిరిగి కలుస్తారని బలంగా ఆశించారు. అందుకే ఇప్పుడు వారికి నిరాశే ఎదురైంది.

కాగా, ప్రేమించి పెళ్లి చేసుకున్న ధనుశ్​ - ఐశ్వర్య పెళ్లైన 18 ఏళ్లకు తమ బంధానికి స్వస్తి పలికారు. ఎంతో సైలెంట్​గా రెండేళ్ల పాటు విడివిడిగా ఉన్న జంట సడెన్​గా విడిపోతున్నాం అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. అలా విడిపోయిన తర్వాత నుంచి ఈ ఇద్దరూ తమ ప్రొఫెషన్ లైఫ్​లో బిజీగా గడపడం మొదలుపెట్టారు. ధనుశ్​ వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్​లో ముందుకెళ్తున్నారు. రీసెంట్​గా కెప్టెన్ మిల్లర్ చిత్రంతో వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు.

మరోవైపు ఐశ్వర్య కూడా రీసెంట్​గా మళ్లీ దర్శకత్వంలోకి అడుగుపెట్టింది. అలా తాజాగా లాల్ సలాం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సూపర్ స్టార్ రజనీ కాంత్ స్పెషల్ కేమియో రోల్ చేశారు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X