Don't Miss!
- Sports
IND vs NZ:పాపం పృథ్వీ షా.. హార్దిక్ పాండ్యా రాజకీయాలకు బలి! ఫ్యాన్స్ ఫైర్!
- News
Lady: విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న భర్త, కవల పిల్లలను హత్య చేసి ఆత్మహత్య చేసుకుంది, రాత్రి !
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
మొన్న ధనుష్ తో అలా.. కొడుకులను దగ్గరి తీసుకొని ధనుష్ మాజీ భార్య ఎమోషనల్
సినిమా ప్రపంచంలో కొంతమంది సెలబ్రిటీలు వారి దాంపత్య జీవితం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ సాధారణ జనాలకు కూడా ఎంతో స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటారు. ఇక దాదాపు 18 ఏళ్ల వరకు అంతే అన్యోన్యంగా జీవనాన్ని కొనసాగించిన ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ కూడా బయట ప్రపంచంలో ప్రతిసారి మంచి కపుల్స్ గా ఆకట్టుకునేవారు. అయితే వారు కొన్ని నెలల క్రితం విడిపోయిన విషయం తెలిసిందే. అయితే వాళ్లు భార్యాభర్తలు విడిపోయినప్పటికీ కూడా తల్లిదండ్రులుగా ఒక బాధ్యతను మాత్రం మర్చిపోలేదు. రీసెంట్ గా ఇద్దరి కొడుకులను దగ్గరకు తీసుకుని ఐశ్వర్య రజనీకాంత్ ఎమోషనల్ అయినట్లు అనిపించింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

ఇష్టంగా పెళ్లి
సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఎంతో ఇష్టపడి ధనుష్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరు కూడా చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం అప్పట్లో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఐశ్వర్య ఆరు నెలలలో పరిచయంలోనే ధనుష్ కు చాలా క్లోజ్ అయిపోయింది. ఇక ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళు ఇష్టాలను కాదనలేక పెళ్లి చేసేసారు.

అన్యోన్యంగానే..
గత 18 ఏళ్లుగా ఐశ్వర్య ధనుష్ ఇద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నారు. కానీ గత ఏడాది నుంచి వారికి విభేదాలు వచ్చినట్లుగా సోషల్ మీడియాలో కొన్ని కథనాలు అయితే వెలువడ్డాయి. అయినప్పటికీ కూడా అభిమానులు ఆ వార్తలను నమ్మలేదు. ఎందుకంటే ఈ న్యూ ఇయర్ పార్టీని కూడా వారు కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు.

ఇద్దరు కుమారులు
అయితే న్యూ ఇయర్ ను కలిసి సెలబ్రేట్ చేసుకున్న కొన్ని రోజులకే ఐశ్వర్య ధనుష్ ఇద్దరు కూడా సోషల్ మీడియాలో విడాకులు తీసుకుంటున్నట్లుగా వివరణ ఇవ్వడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక వారికి ఇద్దరు కుమారులు ఉన్న విషయాన్ని తెలిసిందే. ఒకరు యతి రాజా (16) మరొక కుమారుడు లింగ రాజా (11). అయితే కనీసం వారి పిల్లల కోసం అయినా సరే ఇద్దరు మరొకసారి విరాకుల విషయంపై ఆలోచించాలి అని కుటుంబ సభ్యులు కూడా చాలానే వారితో చర్చలు జరిపినట్లు టాక్ అయితే వచ్చింది.

తండ్రితో కొడుకులు
ఎంతమంది చెప్పినా కూడా ధనుష్ ఐశ్వర్య మాత్రం మళ్లీ కలిసి జీవితాన్ని కొనసాగించేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు అని అర్థమవుతోంది. ఇక రీసెంట్ గా ధనుష్ కొడుకులు తన తండ్రితో కలిసి గ్రేమ్యాన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా విదేశాలకు కూడా తీసుకు వెళ్ళాడు. కొడుకులు కొన్ని రోజులు తండ్రి దగ్గర మరికొన్ని రోజులు తల్లి దగ్గర ఉంటున్నట్లు అర్ధమవుతోంది.

ఎమోషనల్ పోస్ట్
ఇక రీసెంట్గా ఐశ్వర్య రజనీకాంత్ మరోసారి తన ఇద్దరు కొడుకులతో కలిసి ఉన్న ఒక ఎమోషనల్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. కొన్నిసార్లు వారి నుంచి కేవలం ఒక హగ్ మాత్రమే చాలు అని ఆమె ఎమోషనల్ గానే పోస్ట్ చేసినట్లు అనిపిస్తోంది. ఫోటోలో ఐశ్వర్య కొడుకులిద్దర్నీ దగ్గరికి తీసుకున్న విధానం కూడా ఎమోషనల్ గానే ఉంది అని ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు