స్మగ్లింగ్ మీద కన్నేసిన ‘ఆర్ఎక్స్ 100’ డైరెక్టర్!
'ఆర్ఎక్స్ 100' సినిమాతో మొదటి ప్రయత్నంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. తొలి సినిమా కోసం ఒక విభిన్నమైన ప్రేమకథను ఎంచుకుని ప్రేక్షకుల గుండెలు పిండేసే ట్విస్ట్‌తో సూపర్బ్ అనిపించాడు.
రోటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా తన ఫ్యూచర్ ప్రాజెక్టులు ప్లాన్ చేసుకుంటున్న ఈ డైరెక్టర్ తన నెక్ట్స్ ప్రాజెక్టును బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో చేయబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

స్మగ్లింగ్ బ్యాక్‍డ్రాపుతో ఈ మూవీ సాగుతుందని సమాచారం. రొటీన సినిమాలకు భిన్నంగా కమర్షియల్‌గా వర్కౌట్ అయ్యేలా మంచి యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ చిత్రం ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం అజయ్ భూపతి తన స్కిప్టుకు ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నారు. బెల్లం కొండ శ్రీనివాస్ ప్రజెంట్ తేజ దర్శకత్వంలో 'సీత' అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











