సైలెంట్‌గా ఘట్టమనేని వారసుడి లాంచింగ్... పోస్టర్‌తో షాకిచ్చిన టాప్ డైరెక్టర్!
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు, ఇతర టెక్నీషియన్స్ తమ వారసులను ఒక్కొక్కరిగా పరిచయం చేస్తున్నారు. వీరిలో కొందరు గ్రాండ్ ఎంట్రీలను సొంతం చేసుకోవడంతో స్టార్లుగా ఎదిగిపోయారు. వీరి బాటలోనే మరికొందరు సెలబ్రిటీలు తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌లో బలమైన ఘట్టమనేని కుటుంబం నుంచి ఓ వారసుడు రాబోతున్నాడు. ఈ వివరాల్లోకి వెళితే..
సాహసానికి మారుపేరు కృష్ణ
తెలుగు చిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు సూపర్‌స్టార్ కృష్ణ. 5 దశాబ్ధాల పాటు నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా కళామతల్లికి సేవ చేశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుగు చిత్ర పరిశ్రమకు అందించి టాలీవుడ్ నిర్మాణ విలువలను పెంచి, ఎన్నో ప్రయోగాలు చేశారు. ఆయన వేసిన బాటలో దర్శక నిర్మాతలు, హీరోలు టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెబుతున్నారు. కృష్ణ తర్వాత ఆయన వారసులుగా రమేశ్ బాబు, మంజుల, మహేశ్ బాబులు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. వీరిలో మహేశ్ హీరోగా సక్సెస్ కావడంతో పాటు తండ్రిని మించిన తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మూడో తరం
ఇప్పుడు ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మూడో తరం సిద్ధమైంది. రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా లాంచ్ కానున్నారని గత కొద్దిరోజులుగా పుకార్లు వైరల్ అవుతున్నాయి. జయకృష్ణను హీరోను చేయాలని రమేశ్ బాబు కలలుగన్నారు. కానీ కొడుకును హీరోగా చూడకుండానే ఆయన కన్నుమూశారు. దీంతో అన్నయ్య చివరి కోరికను తీర్చాలని మహేశ్ నిర్ణయించుకున్నారు. జయకృష్ణ ఇప్పటికే అమెరికాలో యాక్టింగ్‌లో తీసుకున్నారు. కొద్దిరోజుల క్రితం బాబాయ్ మహేశ్‌తో కలిసి జయకృష్ణ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందం, స్టైల్‌లో మహేశ్‌కు ఏమాత్రం తగ్గని విధంగా ఉన్నాడు జయకృష్ణ.
హీరోగా రమేశ్ బాబు తనయుడు
జయకృష్ణ లాంచింగ్‌కు సంబంధించి పలు స్క్రిప్ట్‌లను పరిశీలించిన మహేశ్.. ఇందులో అన్ని అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దానికి తగినట్లుగా ఓ స్క్రిప్ట్‌ను ఘట్టమనేని ఫ్యామిలీ ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమాకు దర్శకుడు ఎవరు? నిర్మాత ఎవరు? హీరోయిన్ ఎవరు? అంటూ రకరకాల ఊహాగానాలు వచ్చాయి. దీనికి తగినట్లుగానే జయకృష్ణ డెబ్యూ మూవీకి ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించనున్నారని, అలాగే ఎందరో హీరోలను చిత్ర సీమకు పరిచయం చేసిన అశ్వినీదత్.. జయకృష్ణను లాంచ్ చేయబోతున్నారని గాసిప్స్ వైరల్ అయ్యాయి.
ఆ దర్శకుడి చేతుల్లో జయకృష్ణ డెబ్యూ
అయితే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సైలెంట్‌గా షాకిచ్చారు. మీడియాలో వచ్చిన ఊహాగానాలను నిజం చేస్తూ జయకృష్ణను తానే డైరెక్ట్ చేస్తానని అజయ్ భూపతి షాకింగ్ పోస్ట్ పెట్టారు. ఆదివారం ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. అశ్వినీదత్ సమర్పణలో, పీ కిరణ్ నిర్మాతగా చందమామ కథలు అనే బ్యానర్‌పై జయకృష్ణ మూవీ తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను అజయ్ భూపతి పోస్ట్ చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం, శేషాచలం కొండలు బ్యాక్‌డ్రాప్‌లో పోస్టర్ ఉండటంతో ఈ సినిమా .. ఆ ప్రాంతం చుట్టూ తిరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఏబీ4 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్తుండగా.. త్వరలోనే టైటిల్‌ను ఖరారు చేయనున్నారు. అయితే ఈ సినిమాకు శ్రీనివాస మంగాపురం అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి జయకృష్ణ ఎంట్రీ ఖరారు కావడంతో సూపర్‌స్టార్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











