RRR లీక్స్: స్టార్ హీరో సెన్సేషనల్ డెసీషన్.. రెమ్యూనరేషన్ లేకుండానే నటించడానికి గ్రీన్ సిగ్నల్.!
RRR.. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం. కొద్ది నెలలుగా ఈ సినిమా గురించి వచ్చినన్ని వార్తలు దేనిపై రాలేదు. దీనికి కారణం.. ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించడానికి తోడు ఇందులో ఇద్దరు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తుండడమే. దీనికితోడు ఈ మూవీని దాదాపు 400 కోట్ల రూపాయలతో రూపొందిస్తుండడమూ ఒక కారణమే. తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న హీరోకు సంబంధించిన ఓ సెన్సేషనల్ న్యూస్ లీక్ అయింది. ఇంతకీ ఏంటా వార్త.? పూర్తి వివరాల్లోకి వెళితే....

RRR పుట్టింది వాళ్లిద్దరి నుంచే.. ఈ ఇద్దరూ కలిశారు
‘బాహుబలి' సిరీస్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘RRR'. ఎన్టీఆర్, చరణ్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అలాగే, సముద్రఖని, అజయ్ దేవగణ్, రాహుల్ రామకృష్ణ, ఛత్రపతి శేఖర్ సహా ఎంతో మంది కీలక పాత్రలు చేస్తున్నారు. ఉద్యమ వీరులు కొమరం భీం, అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రలతో ఈ మూవీ వస్తోంది.

చాలా వరకు అయింది.. ఫ్యాన్స్‌కు మాత్రం నిరాశే
ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై దాదాపు ఏడాది పైగానే అవుతోంది. ఈ క్రమంలోనే డెబ్బై శాతం షూటింగ్ కూడా పూర్తయిపోయింది. అందులోనూ కీలక సన్నివేశాలు కంప్లీట్ అయ్యాయి. అయినప్పటికీ ఈ సినిమా నుంచి ఒక్క పోస్టర్‌గానీ, టీజర్, గ్లింప్స్, సాంగ్ సహా ఏదీ విడుదల కాలేదు. దీంతో అటు మెగా అభిమానులు, ఇటు నందమూరి ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.

RRR లీక్స్.. సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి
RRR షూటింగ్ విషయంలో దర్శకుడు రాజమౌళి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే షూటింగ్ స్పాట్‌లో సెల్‌ఫోన్ వాడకం కూడా నిషేదించాడు. అయినప్పటికీ ఈ మూవీ నుంచి ఫొటోలు, వీడియోలు లీక్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన కొన్ని షాట్స్ బయటకు వచ్చాయి. అవి మూవీ అంచనాలు పెంచేశాయి.

స్టార్ హీరో సెన్సేషనల్ డెసీషన్.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్
ఈ సినిమాలో తెలుగు హీరోలతో పాటు బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కూడా కీలక పాత్ర చేస్తున్నారు. ఆయన ఇందులో దాదాపు ముప్పై నిమిషాల పాటు కనిపించనున్నారట. తాజాగా ఆయన గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ లీక్ అయింది. దీని ప్రకారం.. ఈ మూవీకి అజయ్ ఒక్క రూపాయి కూడా చార్జ్ చేయడం లేదట. అవును.. ప్రస్తుతం ఈ న్యూస్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

రాజమౌళితో స్నేహం.. అందుకే ఈ నిర్ణయం
రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ' సినిమాను హిందీలో ‘మక్కీ' పేరుతో విడుదల చేశారు. ఇందులో ఈగ పాత్రకు అజయ్ దేవగణ్ వాయిస్ ఇచ్చారు. అప్పటి నుంచి జక్కన్నతో ఆయనకు స్నేహం కుదిరింది. ఈ చనువుతోనే RRRలో రెమ్యూనరేషన్ లేకుండా నటించేందుకు ఆయన నిర్ణయించుకున్నారట. నిర్మాత దానయ్య మాత్రం అజయ్‌కు బ్లాంక్ చెక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని టాక్.
ఊరించి.. చివరకు భారీ షాక్ ఇచ్చిన RRR టీమ్
ఈ సినిమాను జూలై 30, 2020న విడుదల చేస్తామని RRR యూనిట్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. షూటింగ్ ఆలస్యం కావడానికి తోడు మరికొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మార్చారు. జనవరి 8, 2021న దీనిని విడుదల చేస్తామని బుధవారం ప్రకటించింది చిత్ర యూనిట్. దీంతో మెగా, నందమూరి అభిమానులకు భారీ షాక్ తగిలినట్లైంది.


Click it and Unblock the Notifications











