RRRలో అజయ్ దేవగన్, కథని మలుపు తిప్పే పాత్ర.. రాజమౌళి అడిగింది అందుకేనా!
గత కొన్ని రోజులుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కి సంబందించిన న్యూస్ కూడా ఉంది. ఈ చిత్రంలో కేవలం కొన్ని నిమిషాల పాటు ఉండే పాత్ర కోసం రాజమౌళి అజయ్ దేవగన్ ని సంప్రదించారట. అజయ్ దేవగన్ ఆర్ఆర్ఆర్ లో నటించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
రాజమౌళి తెరకెక్కించిన ఈగ చిత్రం హిందీలో కూడా విడుదలైంది. హిందీ వర్షన్ కు అజయ్ దేవగన్ డబ్బింగ్ చెప్పారు. అప్పటి నుంచి రాజమౌళి, అజయ్ మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ చనువుతోనే రాజమౌళి ఆర్ఆర్ఆర్ కోసం అజయ్ ని అడిగారు. కొన్ని నిమిషాల పాటు మాత్రమే ఉండే పాత్ర అయినప్పటికీ అదే చిత్రాన్ని మలుపు తిప్పుతుందని అంటున్నారు.

ఇప్పటికే తమిళ నటుడు సముద్రఖని కీలక పాత్ర కోసం ఎంపికయ్యారు. రాంచరణ్, ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ల కోసం రాజమౌళి ఇంకా వేట కొనసాగిస్తున్నాడు. కొంతమంది బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఇంకా ఖరారు కావడం లేదు. డివివి దానయ్య 300 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్న ఈ చిత్రం 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











