ప్రభాస్ సినిమాలో RRR హీరో: ఆదిపురుష్‌లో కీలక పాత్ర చేయనున్న స్టార్
వరుసగా భారీ చిత్రాల్లోనే నటిస్తూ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు తెలుగు హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'బాహుబలి' నుంచి వరుసగా బడా ప్రాజెక్టుల్లో నటిస్తోన్న అతడు.. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే సినిమా చేస్తున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే.. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో 'సలార్' అనే చిత్రాన్ని ప్రారంభించాడు. వీటితో పాటు 'ఆదిపురుష్' అనే హిందీ చిత్రంలోనూ నటిస్తున్నాడతను. రామాయణ కథతో రూపొందుతోన్న ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న చిత్రమే 'ఆదిపురుష్'. దీన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, రావణుడిగా బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. అలాగే, ఇందులో సీతగా టాల్ బ్యూటీ కృతీ సనన్ నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక, ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ బీ టౌన్ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఆయన చేసే రోల్ విషయంలో క్లారిటీ రాలేదు కానీ.. ఈ మూవీలో ఆయన చేస్తున్నారని మాత్రం ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అజయ్.. పలు హిందీ చిత్రాలతో పాటు దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తోన్న RRRలోనూ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఆ మధ్య ఆయనపై కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











