డ్రగ్స్ కేసులో అరెస్టైన టెంపర్ విలన్‌కు కరోనావైరస్.. ఎన్సీబీలో కలకలం..
డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్, టాలీవుడ్ నటుడు ఎజాజ్ ఖాన్ కరోనావైరస్ బారిన పడ్డారు. రక్త చరిత్ర, టెంపర్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ఆయనను ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఎజాజ్ ఖాన్ ప్రస్తుతం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు కస్టడీలో ఉన్నారు. ఇటీవల ఆయనకు కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపించగా పాజిటివ్ అని తేలింది. దాంతో ఆయనను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు.

ఇదిలా ఉండగా, ఎజాజ్ ఖాన్ కరోనావైరస్ అని తేలియగానే ఎన్సీబీ అధికారుల్లో కలవరం మొదలైంది. వెంటనే ఎజాజ్ ఖాన్‌తో ఉన్న అధికారులందరూ క్వారంటైన్‌లోకి వెళ్లినట్టు సమాచారం. ప్రస్తుతం అధికారులందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది.
ఎజాజ్ ఖాన్ అరెస్ట్‌కు ముందు ఆయన నివాసంలో ఎన్సీబీ అధికారులు నవీ ముంబై, జోగేశ్వరి ప్రాంతంలోని ఆయన నివాసంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో ఆయనతో ఉన్న విదేశీ మహిళ చాకచక్యంగా తప్పించుకొన్నట్టు తెలిసింది. ఆమె కోసం ఎన్సీబీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











