దూరం నుంచే ఇడ్లి అమ్ముకునే తెలుగు వ్యక్తి కష్టాన్ని చూసి సహాయం చేసిన అజిత్.. ఎంత ఇచ్చాడంటే

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఎంత మంచి మనసు ఉన్నవాడో తమిళ అభిమానులను అడిగితే చాలా వివరంగా చెప్పేస్తారు. ఈ స్టార్ హీరో తమిళ్ వ్యక్తి అయినప్పటికీ తెలుగు వారితో ప్రత్యేక అనుబంధం ఉంది. అతను పుట్టింది కూడా సికింద్రాబాద్ లోనే. మొదట తల్లి తండ్రులతో హైదరాబాద్ లోనే ఉండేవారు. అయితే ఇటీవల ఒక సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన అజిత్ దూరం నుంచి ఒక తెలుగు వ్యక్తి కష్టాన్ని చూసి ఆర్థిక సహాయం అంధించాడని తెలుస్తోంది.

Recommended Video

Ajith Heads To Sikkim By Bike For 4000-km Road Trip | Filmibeat Telugu
 చాలా కష్టపడుతున్నాడు

చాలా కష్టపడుతున్నాడు


అజిత్ నెక్స్ట్ 'వాలిమై' అనే సినిమాతో రాబోతున్నాడు. H వినోధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అంచనాలు అయితే భారిగానే ఉన్నాయి. ఎందుకంటే అందులో అజిత్ ఒక బైక్ రెజర్ గా కనిపించబోతున్నాడు. అజిత్ కు బైక్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఒక్క కారణంగా సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అలాగే చాలా కష్టపడుతున్నట్లు కూడా టాక్ వస్తోంది.

పనితనం నచ్చడంతో..

పనితనం నచ్చడంతో..

ఇక ఇటీవల ఆ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ ను షూట్ చేయడానికి హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చారు. అయితే షూటింగ్‌లో ఉన్న అజిత్ రోడ్డు పక్కన రోజు ఒక ఇడ్లీ అమ్ముకునే వ్యక్తి కష్టాన్ని చూసేవాడట. ఇక అతని నుంచి స్పెషల్ గా ఇడ్లి తెప్పించుకొని మరి రుచి చూశాడట. అతని పనితనం బాగా నచ్చడమే కాకుండా తక్కువ ధరలో నాణ్యమైన ఇడ్లిని అందించడం బాగా నచ్చిందట.

ఆర్థిక పరిస్థితులపై ఆరా తీసిన అజిత్

ఆర్థిక పరిస్థితులపై ఆరా తీసిన అజిత్


అంతే కాకుండా పెద్దగా హడావుడి లేకుండా అజిత్ ఇడ్లి అమ్ముకునే వ్యక్తిని పర్సనల్ గా కలిసినట్లు తెలుస్తోంది. అయితే సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం ఏండింగ్ లో ఉన్నప్పుడు అజిత్ అతని ఆర్థిక పరిస్థితుల గురించి కూడా సహచరుల ద్వారా తెలుసుకున్నట్లు సమాచారం.

సహాయం అందించి..

సహాయం అందించి..

ఇడ్లి అమ్ముతూ జీవనాన్ని కొనసాగిస్తున్న ఆ వ్యక్తి కూతురు విద్య కోసమే ఎక్కువగా కష్టపడుతున్నట్లు తెలుసుకున్న అజిత్ అతని వ్యాపారానికి ఉపయోగపడే విధంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అంధించినట్లు తెలుస్తోంది. మనస్ఫూర్తిగా అజిత్ అతనికి సహాయం అంధించిన విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సహాయం చేసిన విషయాన్ని అందరికి చెప్పి హంగామా చేయాల్సిన అవసరం లేదని మరోసారి తన మంచి తనాన్ని నీరూపించుకున్నాడు ఈ స్టార్ హీరో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X