twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు యంగ్ హీరోపై అజిత్ ప్రశంసలు: ‘వలిమై’లో హైలైట్ అతడేనంటూ!

    |

    పేరుకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. విలక్షణమైన నటన.. విభిన్నమైన చిత్రాలతో దక్షిణాది మొత్తం మెచ్చే స్టార్‌గా ఎదిగిపోయాడు బడా హీరో అజిత్ కుమార్. కెరీర్ ఆరంభంలోనే భారీ హిట్లను అందుకున్న అతడు.. తక్కువ సమయంలోనే గొప్ప నటుడిగా పేరు తెచ్చకున్నాడు. అదే సమయంలో స్టార్‌డమ్‌ను కూడా అందుకున్నాడు. మరీ ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ మన్ననలు పొందుతూ ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇలా దాదాపు మూడు దశాబ్దాలుగా హవాను చూపిస్తున్నాడు. దీంతో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు.

    బాత్రూంలో బట్టలు లేకుండా శ్రీరెడ్డి: శృతి మించిన హాట్ షోతో మరీ దారుణంగా!బాత్రూంలో బట్టలు లేకుండా శ్రీరెడ్డి: శృతి మించిన హాట్ షోతో మరీ దారుణంగా!

    గతంలో వరుస విజయాలను అందుకున్న అజిత్.. ఈ మధ్య చాలా కాలం పాటు ఫ్లాపులను చవి చూస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం హిందీ చిత్రం పింక్‌కు రీమేక్‌గా వచ్చిన 'నెర్కొండ పార్వాయి'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఈ విజయం ఇచ్చిన జోష్‌తోనే ఆ వెంటనే 'వలిమై' అనే సినిమాను మొదలు పెట్టేశాడు. దీన్ని కూడా హెచ్ వినోథ్ తెరకెక్కించాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అయినా.. అనివార్య కారణాల వల్ల పలుమార్లు ఆటంకం కలిగింది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ గత ఏడాది చివర్లో పూర్తైంది. అలాగే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం శరవేగంగా పూర్తి చేసుకున్నారు.

    Ajith Kumar Praises on Kartikeya Gummakonda

    కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌ నటించిన 'వలిమై' సినిమాను ఫిబ్రవరి 24న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక, ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, కన్నడం, హిందీలోనూ విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక, ఈ మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే, అజిత్ కుమార్ ఫ్యాన్స్ సైతం ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు కూడా వేచి చూస్తున్నారు. దీనికి కారణం ఇందులో మన యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ విలన్‌గా నటిస్తుండడమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

    బాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్ రచ్చ: అందాలన్నీ చూపిస్తూ హద్దు దాటిన బ్యూటీబాత్‌టబ్‌లో నగ్నంగా హీరోయిన్ రచ్చ: అందాలన్నీ చూపిస్తూ హద్దు దాటిన బ్యూటీ

    క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'వలమై' మూవీ విడుదలకు సమయం ఆసన్నమవడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసేసింది. ఇందులో భాగంగానే తాజాగా అజిత్ కుమార్ ఓ ప్రముఖ ఛానెల్‌తో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో విలన్‌గా నటించిన తెలుగు హీరో కార్తికేయపై ప్రశంసల వర్షం కురిపించాడు. 'కార్తికేయ నటన చూసి ఫిదా అయిపోయాను. సినిమా పట్ల అతడికి ఉన్న ప్రేమ నాకు బాగా కనిపించింది. వలిమైలో కార్తికేయ యాక్టింగ్ హైలైట్ కాబోతుంది. మా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ అదిరిపోయేలా డిజైన్ చేశారు' అంటూ వెల్లడించాడు.

    ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'వలిమై' మూవీలో అజిత్ కుమార్ డుయల్ రోల్ చేసినట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అందులో ఒకటి బైక్ రేసర్ పాత్ర అని కూడా అంటున్నారు. ఈ చిత్రం పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. ఇందులో తెలుగు యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ విలన్‌గా నటించాడు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్ దీన్ని నిర్మించాడు. ఇందులో హుమా ఖురేషి కథానాయికగా నటించింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వీడియోల వల్ల ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

    English summary
    Kollywood Star Hero Ajith Kumar Upcoming Movie Valimai directed by H. Vinoth. Recently Ajith Kumar Praised Kartikeya Gummakonda.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X