సందీప్ రెడ్డి వంగకు షాక్ ఇచ్చిన అజిత్.. తమిళ స్టార్ ఏం చేశాడంటే?
తెలుగులో భారీ చిత్రాలను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో తాజాగా వచ్చిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. తమిళ ఇండస్ట్రీకి చెందిన అగ్ర హీరో అజిత్ కుమార్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణ న్ చాలా కాలం తర్వాత మళ్లీ అజిత్ సరసన నటించింది. ఈ చిత్రాన్ని అధిక రవిచంద్రన్ డైరెక్ట్ చేశారు. నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మాతలుగా 300 కోట్ల బడ్జెట్తో గ్రాండ్గా నిర్మించారు. ఏప్రిల్ 10న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. తొలి రోజు మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
అజిత్ చివరిగా విదముయార్చి చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా పెర్ఫార్మ్ చేయలేకపోయింది. దీంతో అజిత్ కుమార్ అభిమానులకు గుడ్ బాడ్ అగ్లీ చిత్రం ద్వారా మంచి సినిమా అందింది. తొలిరోజే బాక్సాఫీస్ వద్ద రూ.51 కోట్ల గ్రాసును వరల్డ్ వైడ్ గా అందుకుంది. అయితే ఈ చిత్రంలో ఓ ఇంట్రెస్టింగ్ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అజిత్ కుమార్ నటించిన ఈ యాక్షన్ కామెడీ సినిమాలో అమెరికన్ యాక్టర్, సౌత్ కొరియా నటుడు, ప్రొడ్యూసర్ డాన్ లీ కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కామియో అప్పీరెన్స్లో ఆయన కనిపించారు.

గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో టైటిల్ ను రిఫర్ చేసేలా కామియో అపీయన్స్లో విదేశీ నటులు డాన్ లీ, జాన్ విక్ లను దర్శకుడు అధిక్ యానిమేటెడ్ ద్వారా వారిని చూపించారు. దీంతో ప్రేక్షకులు ఎంతగానో సర్ప్రైజ్ అవుతున్నారు. అయితే టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తన రాబోయే చిత్రం స్పిరిట్ కోసం ప్రముఖ నటుడు డాన్ లీని విలన్ పాత్రలో తీసుకోబోతున్నట్టుగా ఇప్పటికే ప్రచారం జరిగింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు దీటైన విలన్ గా అతను సరిపోతాడని భావించారంటూ గాసిప్స్ వచ్చాయి. అయితే సందీప్ రెడ్డి వంగా కంటే ముందే అజిత్ సినిమాలో ఆయన యానిమేటెడ్ అప్పియరెన్స్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
డాన్ లీకి ఓవర్సీస్ తో పాటు ఇండియాలోనూ మంచి క్రేజ్ ఉంది. కొరియన్ సినిమాలు చూసే ప్రేక్షకులు మన దగ్గర చాలామంది ఉండడంతో ఆయన సినిమాలకు ఇక్కడ కూడా మార్కెట్ ఉంది. ఆయనకు అభిమానులు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ అప్ కమింగ్ ఫిలిం స్పిరిట్ లో ఆయన్ని చూపిస్తారని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక అజిత్ చిత్రంలో మాత్రం డాన్ లీ కేవలం యానిమేటెడ్ వెర్షన్ లో కనిపించి సర్ప్రైజ్ చేశారు. దీంతో ఆయన డైరెక్ట్ ఫిలింలో ఫుల్ లెన్త్ రోల్ లో కనిపిస్తే దుమ్ము లేచిపోతుందని ప్రేక్షకులు అంటున్నారు. ఇక ప్రభాస్ తో ఆయన స్క్రీన్ షేర్ చేసుకుంటే మాత్రం థియేటర్లు తగలబడిపోతాయని, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ తో సినిమా హాల్స్ బద్దలై పోవడం ఖాయం అంటున్నారు.
సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం స్పిరిట్ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఫస్ట్ షెడ్యూల్ మిక్సీకో లో షూట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో డాన్ లీ ఉంటారా లేరా అనేది మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ప్రభాస్ ను సందీప్ రెడ్డి వంగ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా చూపించబోతుండడం విశేషం. ఇటు అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం తమిళంలో మాత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది. ఈ చిత్రంలో సీనియర్ నటి సిమ్రాన్, ప్రియా ప్రకాష్ వారియర్, అర్జున్ దాస్, సునీల్, బాలీవుడ్ సీనియర్ హీరో జాకీ ష్రాఫ్, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











