చెప్పకుండా రీమేక్ .. 150 కోట్లు కట్టమంటూ సౌత్ స్టార్ హీరోకి నిర్మాతలు షాక్?
ప్రస్తుతం జనం ఓటీటీలు బాగా చూసేస్తుండడంతో మన హీరోలకి స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది పెద్ద సమస్యగా మారింది. వారిని రంజింప జేయడానికి కొత్త స్క్రిప్ట్స్ తప్పనిసరి అయ్యిపోయాయి. కాగా ఈ స్టార్ హీరోస్ అయితే ఖచ్చితంగా స్ట్రెయిట్ సినిమాతో వస్తే తప్ప బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమాకి మినిమం ఓపెనింగ్స్ కూడా వచ్చే పరిస్థితి కనపడడం లేదు.
దీనితో మన స్టార్స్ రీమేక్ అంటేనే ఒకింత ఆలోచించి అడుగు వేయాల్సి వస్తోంది. ఒకప్పుడు అంటే ఓటీటీలు లేవు ఇతర భాషల్లో హిట్ సినిమాలు మన దగ్గర చేస్తే హిట్ అయ్యేవి, ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. కానీ ఇపుడు పరిస్థితులు అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ఒక సినిమా అనౌన్స్ చేయడం భయం అది స్ట్రెయిట్ సినిమానా లేక రిమేక్ సినిమానా అనే చర్చ మొదటిగా వినిపిస్తుంది.

కాగా మన సౌత్ ఇండస్ట్రీలో ఇప్పటికీ స్టార్స్ రీమేక్స్ అంటూ వెళుతున్నారు. వారిలో మన తెలుగు నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవిలు ఉంటే తమిళ సినిమా నుంచి అజిత్ కుమార్, విజయ్ లు కనిపిస్తారు. అయితే విజయ్ చాలా కాలం నుంచి రిమేక్ లు ఆపేసి స్ట్రెయిట్ సినిమాలు చేస్తూ ఊహించని బాక్సాఫీస్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు.
కానీ ఇప్పుడు మాత్రం మన భగవంత్ కేసరి రీమేక్ చేస్తున్నట్లు పలు ఊహాగానాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ హీరో అజిత్ విషయానికి వస్తే తను ప్రెజెంట్ రెండు సినిమాలు చేస్తుండగా వాటిలో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకి మొదట్లోనే రీమేక్ మరకలు అంటుకున్నాయి . కానీ దానికి ముందు అనౌన్స్ చేసి స్టార్ట్ చేసిన విడా ముయర్చి పై షాకింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఇన్ని రోజులు ఈ సినిమాని అంతా స్ట్రెయిట్ సినిమా అనుకున్నారు కానీ ఇది స్ట్రెయిట్ సినిమా కాదు రీమేక్ సినిమా అని అంటున్నారు. ఇంకా ట్విస్ట్ ఏమిటంటే ఈ సినిమాని ఎలాంటి రీమేక్ హక్కులు కొనకుండా చేసేసారు అంటూ కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మాములుగా ఒక రీమేక్ అంటే ఖచ్చితంగా ముందు దాని హక్కులు కొనుకొనే స్టార్ట్ చేస్తారు. కానీ ఈ సినిమాకి మాత్రం అలా చేయలేదట. దీనికి ఒరిజినల్ సినిమా హాలీవుడ్ లో ఎప్పుడో వచ్చిన సినిమా అట. అందుకే సైలెంట్ గా రీమేక్ గా తెరకెక్కించేసారని తెలుస్తోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే హాలీవుడ్ లో వచ్చిన "బ్రేక్ డౌన్" అట.

దీనిని హాలీవుడ్ భారీ సినిమాల నిర్మాణ సంస్థ పారా మౌంట్ వారు నిర్మించారు. అయితే తమ సినిమాని తమకి తెలియకుండా రీమేక్ చేశారు అనే అంశం వారి దృష్టికి రావడంతో వారు అజిత్ సినిమా నిర్మాతలకు షాకిచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. తమకు తెలియకుండా ఎలాంటి రీమేక్ హక్కులు కొనకుండా సినిమా చేసినందుకు తమకి గాను 15 మిలియన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారట.
అంటే దాదాపు రూ. 150 కోట్ల మేర డిమాండ్ చేస్తున్నారని ఇపుడు టాక్ వైరల్ గా మారింది. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది ఇంకా తేలాల్సి ఉంది . కాని రెండు సినిమాలని పోలుస్తూ పలు పోస్టర్స్ మాత్రం సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి. అయితే అజిత్ లాంటి ఓ బిగ్ స్టార్ తో సినిమాని సైలెంట్ గా రీమేక్ అని తెలియకుండా తెరకెక్కించడం ఆసక్తికరమైన అంశమే అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











