Chiru154: ‘వేదాళం’ రీమేక్ నుంచి అదిరిపోయే ప్రకటన.. చిరంజీవి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్
టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫుల్ జోష్‌లో ఉన్న ఆయన.. ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఇప్పటికే పలు ప్రాజెక్టులను పూర్తి చేసేశారు. ఈ క్రమంలోనే మరిన్ని చిత్రాలను లైన్‌లో పెట్టుకున్నారు. అందులో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న 'ఆచార్య' రెండు పాటలు మినహా మొత్తం పూర్తైంది. దీంతో ఆ వెంటనే తన 153వ చిత్రంగా రాబోతున్న 'లూసీఫర్' రీమేక్‌ను సైతం ఈ మధ్యనే పట్టాలెక్కించేశారు. ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి వరుసగా రీమేక్ మూవీలను చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తమిళంలో తలా అజిత్ కుమార్ హీరోగా సూపర్ డూపర్ హిట్ అయిన 'వేదాళం' సినిమాను రీమేక్ చేస్తున్నారు. దీన్ని ఫ్లాప్ చిత్రాల దర్శకుడిగా పేరొందిన మెహర్ రమేష్ రూపొందించబోతున్నాడు. చాలా కాలం తర్వాత ఈ డైరెక్టర్ మరోసారి మెగా ఫోన్ పట్టబోతున్నాడు. 'లూసీఫర్' రీమేక్ పూర్తైన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కబోతుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ప్రముఖ నిర్మాణ సంస్థ నుంచి అదిరిపోయే ప్రకటన వెలువడింది.

చిరంజీవి నటించబోయే 'వేదాళం' రీమేక్‌ను ఎవరు నిర్మిస్తారన్న దానిపై రకరకాల కథనాలు వస్తున్నాయి. కానీ, ఇప్పటి వరకూ ఈ సినిమా బ్యానర్ గురించి క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ ప్రాజెక్టు గురించి సర్‌ప్రైజ్ అనౌన్స్‌మెంట్ చేసింది. అందులో 'మెగాస్టార్ పుట్టినరోజును మరింత ఆనందోత్సవాలతో జరుపుకుందాం. మేము మిమ్మల్ని సంతోష పరిచేందుకు ఓ అప్‌డేట్‌తో వస్తున్నాము. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22, ఉదయం 9 గంటలకు చిరంజీవి 154వ మూవీ సర్‌ప్రైజ్ రాబోతుంది' అని పేర్కొన్నారు.
'వేదాళం' రీమేక్ చిరంజీవి నటిస్తోన్న 154వ సినిమా. దీన్ని మెహర్ రమేష్ తెరకెక్కిస్తుండగా.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నట్లు ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రకు మహానటి కీర్తి సురేష్‌ను తీసుకున్నారని ఈ మధ్య ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇక, తమిళంలో కంటే ఇందులో సిస్టర్ సెంటిమెంట్ పార్ట్‌ను మరింతగా పెంచాడట మెహర్ రమేష్. దానికి బలమైన భావోద్వేగాలతో కూడిన సీన్స్‌ను కూడా రాసి పెట్టేశాడని అంటున్నారు.

ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ సెంటిమెంట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'భోలా శంకర్' అనే టైటిల్ ఫిక్స్ చేశారని ఇటీవలే ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇక, ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి గుండుతో కనిపించబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకోసమే ఆయన ఆ మధ్య లుక్ టెస్ట్ కూడా చేసుకున్నారనే టాక్ వినిపించింది. అలాగే, ఈ సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్యా పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటింబోతుంది. ఆగస్టు 22న రాబోతున్న అప్‌డేట్‌లో సినిమా టైటిల్‌ను రివీల్ చేసే అవకాశం ఉన్నట్లు ఫిలిం నగర్ ఏరియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











