మా నాన్నని బీట్ చేయడం కష్టం.. పూరి జగన్నాథ్‌లో ఈ టాలెంట్ కూడా ఉందా!
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల పూరి జగన్నాథ్ కు సరైన విజయం లేదు. పూరి చివరగా తన తనయుడు ఆకాష్ పూరితో తెరకెక్కించిన మెహబాబా చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. రామ్ చిత్రంతో తిరిగి పుంజుకోవాలని పూరి జగన్నాథ్ భావిస్తున్నారు. తాజాగా ఆకాష్ పూరి తన తండ్రి పూరి జగన్నాథ్ కు సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.
పూరి జగన్నాథ్ మెరుపు వేరంతో నన్ చాక్ తిప్పుతూ కనిపిస్తున్నాడు. పూరిలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోకు.. 'మా నాన్నని బీట్ చేయలేను' అని ఆకాష్ పూరి కామెంట్ పెట్టాడు. వావ్ అమేజింగ్, బ్రూస్లీని చూస్తున్నట్లు ఉంది అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఆకాష్ పూరి తన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నాడు.

రామ్ తో తెరకెక్కిస్తున్న ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని పూరీజగన్నాథే నిర్మిస్తుండడం విశేషం. ఈ చిత్రంలో నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











