Romantic Twitter Review: ఆకాష్ పూరి చంపేశాడు కానీ.. రొమాంటిక్ ఎలా ఉందంటే?
టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు అందుకున్న పూరి జగన్నాథ్ తన కొడుకుని మంచి హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఆయన చేసిన మొదటి ప్రయత్నం మెహబూబా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరొక దర్శకుడి చేతిలో పెట్టిన పూరి రొమాంటిక్ అనే సినిమాను నిర్మించాడు. ఆ సినిమా నేడు వరల్డ్ వైడ్ గా విడుదల అవుతోంది. ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు కొన్ని ప్రత్యేకమైన షోలను కూడా ప్రదర్శించారు. ఇక సినిమా చూసినవా రా చాలా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ట్విట్టర్ లో కొంత మంది నెటిజన్లు ఈ విధంగా స్పందించారు.

అగ్రదర్శకులు పాజిటివ్ కామెంట్స్
దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమా విడుదలకు రెండు రోజుల ముందే ఈ సినిమాను ఇండస్ట్రీలోని ప్రముఖులు దర్శకులకు నిర్మాతలకు అలాగే నటీనటులకు కూడా రొమాంటిక్ సినిమా ప్రివ్యూలను వేశారు. సినిమాను చూసిన చాలామంది అగ్ర దర్శకులు కూడా ఎంతో పాజిటివ్ గా స్పందించారు. సినిమా చాలా అద్భుతంగా ఉందని పూరి తనయుడు తండ్రి పేరు నిలబెట్టేలా ఉన్నాడు అని వివరణ ఇచ్చారు.

నమ్మకంతోనే భారీ స్థాయిలో
పూరి కనెక్ట్స్ బ్యానర్ లో చార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మించిన రొమాంటిక్ సినిమాపై మొదటి నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ తోనే మంచి హైప్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా యువత ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు సోషల్ మీడియాలో హడావిడి చూస్తుంటే అర్థమవుతుంది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకుంటుందని చిత్ర యూనిట్ నమ్మకంతోనే భారీ స్థాయిలో విడుదల చేస్తోంది.
ఆకాష్ చంపేశాడు
యువహీరో తేజ సజ్జ కూడా ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూని ప్రత్యేకంగా వీక్షించాడు. ఇప్పుడే రొమాంటిక్ సినిమా చూశాను అంటూ మొత్తంగా ఈ సినిమాను ఎంతగానో ఎంజాయ్ చేశాను అని చెప్పాడు. యాక్టర్ ఆకాష్ నిజంగా చంపేశాడు అంటూ హీరోయిన్ కేతికశర్మ కూడా సరైన న్యాయం చేసిందని ట్వీట్ చేశాడు. ఇక చిత్ర యూనిట్ సభ్యులందరికీ కూడా తేజ తన బెస్ట్ విషెస్ అందించాడు.
పూరి గారి అబ్బాయి ఇరగదీశాడు
ఇక పూరి అభిమానులు ఈ సినిమా కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నట్లు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయినప్పుడు కూడా పూరి ఫాలోవర్స్ భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేశారు అని క్లారిటీగా అర్థమయ్యింది. ఇక ఆకాష్ పూరి సినిమా చూసిన తర్వాత పూరి గారి అబ్బాయి ఇరగదీశాడు అంటూ చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
ప్రభాస్ ఫ్యాన్స్ మద్దతు
చాలామంది ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు ఇటీవల క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే ప్రభాస్ ఈ సినిమా హిట్ అవ్వాలని చాలా బలంగా కోరుకుంటున్నారు. పూరి జగన్నాథ్ ఫ్యామిలీతో డార్లింగ్ కు మంచి అనుబంధం ఉంది. అందుకే ఆకాష్ పూరి కోసం ప్రత్యేకంగా ట్రైలర్ లాంచ్ చేయడమే కాకుండా ఇంటర్వ్యూ కూడా చేశాడు. ఆ ఇంటర్వ్యూ సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేసింది. దీంతో ప్రభాస్ అభిమానులు కూడా ఈ సినిమా అద్భుతంగా ఉందని అంటున్నారు.
Recommended Video
డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి.. కానీ..
మరికొందరు మాత్రం సినిమా అంతగా ఆకట్టుకోలేదు అని అంటున్నారు. అంతే కాకుండా ప్రత్యేకంగా రివ్యూ రేటింగ్స్ కూడా ఇస్తున్నారు. ఈ సినిమాలో డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి కానీ ఓవరాక్షన్ సీన్స్ అయితే చాలా ఉన్నాయి అని అంటున్నారు. అంతేకాకుండా సినిమాను మొత్తంగా చూపించిన విధానం కూడా అంతగా ఆకట్టుకోలేదని రొమాంటిక్ సీన్స్ తప్పితే మిగతా సన్నివేశాలను అంతగా ఆకట్టుకునేలా చూపించలేదని అంటున్నారు.


Click it and Unblock the Notifications











