అది కావాలని చేసింది కాదు.. చిరంజీవి ఇన్సిడెంట్‌‌పై అఖండ 2 బ్యూటీ కామెంట్స్..

అఖండ 2 బ్యూటీ హీరోయిన్ సంయుక్త మేనన్.. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. తర్వాత బింబిసార, విరూపాక్ష, సార్ వంటి వరుస చిత్రాలతో వరుస విజయాలను సాధించి టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న స్వయంభులో హీరోయిన్‌గా నటిస్తుండగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా చేస్తున్న కొత్త సినిమాలోనూ సంయుక్త ఎంపికైనట్టుగా టాక్ ఉంది. ఇక నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అఖండ 2లో కూడా కీలక పాత్రలో నటించారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి తో జరిగిన ఇన్సిడెంట్ ను పంచుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

ఇంతకీ ఆ ఇన్సిడెంట్ ఎంటీ? మెగాస్టార్ చిరంజీవి ఓ కార్యక్రమంలో ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ఆయన ప్రసంగం అనంతరం జరిగిన దీపప్రజ్వలనలో చిరంజీవి స్వయంగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీపం వెలిగించే ముందు చిరంజీవి తన షూ విప్పి పక్కకు పెట్టుకున్నారు. తర్వాత తిరిగి షూ వేసుకునే సమయానికి ఆయన కొద్దిగా ఇబ్బంది పడ్డారనే విషయం అక్కడి వారంతా గమనించారు. వెంటనే అక్కడ ఉన్నవారు ఆయనకు సహాయం చేయడానికి ముందుకు రావడంతో చిన్నపాటి ఆసక్తికర పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సంయుక్త మేనన్ కూడా చిరంజీవికి షూ తొడిగేందుకు ముందుకొచ్చింది. కానీ చిరంజీవి మర్యాదపూర్వకంగా ఆమెను ఆపేశారు. సంయుక్త చూపిన వినయం, పెద్దలను గౌరవించే తీరుపై సోషియల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో వైరల్‌గా మారింది.

Akhanda 2 actress Samyuktha Menon Speaks About Viral Chiranjeevi Incident

అఖండ 2 సినిమా ప్రమోషన్స్ లో భాగం హీరోయిన్ సంయుక్త మేనన్ ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్య్వూలో మెగాస్టార్ చిరంజీవి తో జరిగిన ఇన్సిడెంట్ ను పంచుకున్నారు. చిరంజీవి గారితో జరిగిన ఘటన గురించి సంయుక్త మాట్లాడుతూ.. మీరు ఎంత వినయం గా, పెద్దలకు ఎంత గౌరవిస్తారో ఆ వీడియో చూస్తే అర్థమవుతుందని యాంకర్ అనగా.. వెంటనే హీరోయిన్ సంయుక్త మీనన్ స్పందించారు.

'ఆ వీడియో విడుదలైన తర్వాత.. నేను చాలా రియలైజ్ అయ్యాను. నేను కావాలని చేసింది కాదు. ఆ సందర్భంలో ఎవరన్నా అలానే ప్రవర్తించే దానిని.. అటోమిటిక్ గా అలానే ప్రవర్తిస్తా. నేను పెరిగిన పరిసరాలు.. చదువుకున్న విద్యాసంస్థలు.. నేను అలా మారడానికి కారణం. ఈ క్రమంలోని ఆధ్యాత్మిక భావన, సత్సంగం, గురు పాదుకం అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెద్దలపట్ల గౌరవం గురించి తెలుపుతుంది. బాల్యంలో నుండి ఇలాంటి విషయాలపై అనుకోకుండా రియాక్ట్ అవ్వడం నేర్చుకున్న.. ఇప్పుడు కూడా వాటిని ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు. అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది

ఇదిలా ఉండగా, అఖండ 2 ప్రమోష‌న్లలో భాగంగా ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంయుక్త మేనన్, ఈ ఘటన గురించి మొదటిసారి స్పందించింది. యాంకర్ ఈ వీడియోపై మాట్లాడుతూ "మీరు చిరంజీవి గారికి చూపిన వినయం అందరికీ ఆదర్శంలా ఉంది" అని ప్రశంసించగా, వెంటనే సంయుక్త వినయంతో స్పందించింది. 'ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత నేనూ చాలా రియలైజ్ అయ్యాను. నేను కావాలనే చేసిన చర్య కాదు. ఆ సమయంలో ఎవరైనా ఆ పరిస్థితిలో ఉంటే అలానే ప్రవర్తిస్తాను. ఇది నేనెవర్ని అనుకరిస్తున్నానో కాదు... నేను పెరిగిన పరిసరాలు, నేర్చుకున్న విద్య, సత్సంగం ఈ విలువల వల్లే అలాంటి రియాక్షన్ వచ్చింది" అని వివరించింది.

సంయుక్త మాట్లాడుతూ చిన్నప్పటి నుండి పెద్దల పట్ల గౌరవం, భక్తి, ఆధ్యాత్మిక భావన తనలో సహజంగానే పెరిగాయని తెలిపింది. "గురు పదుకాలు, పెద్దల నేపథ్యం, సంస్కృతి ఇవన్నీ ఇలాంటి చిన్న విషయాల్లో బయటపడతాయి. నేను చాలా నార్మల్‌గా భావించాను. నా దృష్టిలో ఇది ఇబ్బందికర విషయం కాదు" అంటూ సంయుక్త తెలిపింది. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో సంయుక్త మేనన్ వినయం, వ్యక్తిత్వం, విలువలు మరోసారి సోషల్ మీడియాలో చర్చకు వస్తున్నాయి.

ఇదిలాఉంటే.. నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన మూవీ అఖండ 2 : తాండవం (Akhanda 2). భారీ బడ్జెట్ మూవీ గురువారం సాయంత్రం నుంచే ప్రీమియర్లతో సినిమా విడుదలవుతుందన్న వార్తలు వచ్చాయి. అయితే చివరి నిమిషంలో షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 5న థియేటర్లకు రావాల్సిన ఈ మూవీ అనివార్య కారణాల వల్ల విడుదల చేయలేకపోతున్నామని నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ప్రకటించింది. అభిమానులకు, ప్రేక్షకులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతూ పరిస్థితిని త్వరగా సర్దుబాటు చేసి కొత్త అప్‌డేట్ ఇస్తామని స్పష్టం చేసింది. విడుదల కోసం బాలకృష్ణ తన రెమ్యునరేషన్‌ ను వెనక్కి ఇచ్చేశారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఫైనాన్షియల్ సమస్యలు త్వరగా క్లియర్ అయ్యేందుకు ప్రముఖ నిర్మాతలు కూడా జోక్యం చేసుకున్నట్టు తెలుస్తోంది.

14 రీల్స్ ప్లస్ ప్రొడ్యూసర్లు రామ్ ఆచంట, గోపీ ఆచంటలు బాలయ్య ఉన్నాడనే నమ్మకంతో రిలీజ్‌కు ఎలాంటి అడ్డంకి ఉండదని భావించినట్టు టాక్. బడా స్టార్, ఎమ్మెల్యే, కేంద్రం-రాష్ట్రాల్లో ప్రభావం ఉండడంతో సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయని నిర్మాతలు అనుకున్నారు. ఇదే ధైర్యంతో ఏరోస్ ఫైనాన్స్ వివాదం పెద్దగా ప్రభావం చూపదని భావించారని సినీ వర్గాల టాక్. ఇక బాలకృష్ణ కెరీర్‌లో విడుదల రోజుకీ నిలిచిపోయిన సినిమా ఇదే మొదటిదని చెప్పవచ్చు. సాధారణంగా నిర్మాతలే అన్ని విషయాలను సోర్ట్ అవుట్‌ చేసుకుంటారని బాలయ్య కూడా నమ్మినా, చివరకు ఈ పరిస్థితి ఎదురైంది. బాలయ్యలాంటి పెద్ద స్టార్ చిత్రం ఇలా ఆగిపోవడం ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X