Akhanda 2: అఖండ 2 లో స్టార్ డైరెక్టర్ వారసుడు.. కీలక పాత్రను రివీల్ చేసిన బోయపాటి..
Akhanda 2: గాడ్ ఆఫ్ మాసెస్, నటరత్న నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మూవీ అఖండ 2 - తాండవం ( Akhanda 2-Thaandavam ). ఈ భారీ బడ్జెట్ మూవీ విడుదలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. భారీ హైప్, పాజిటివ్ బజ్ మధ్య ఈ సినిమా డిసెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలకృష్ణ - బోయపాటి కాంబో నాలుగోసారి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించబోతుంది. దీంతో ఈ సీక్వెల్‌పై ఇండియా వైడ్‌గా ప్రేక్షకుల దృష్టిలో నిలిచింది. ఈ నేపథ్యంతో డైరెక్టర్ బోయపాటి శ్రీను ఓ స్పెషల్ క్యారెక్టర్ గురించి బయటపెట్టారు? ఇంతకీ ఆ పాత్ర ఏంటీ? ఆ పాత్రలో ఎవరు నటించారు?
బ్లాక్‌బస్టర్ సాధించిన అఖండ ( Akhanda) మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. ఇక మ్యూజిక్ మాంత్రికుడు డైరెక్టర్ ఎస్. థమన్ ఈసారి కూడా దుమ్మురేపాడు. అఖండలో థమన్ ఇచ్చిన బీజీఎం (BGM) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో సీక్వెల్‌పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో వినిపించిన అఘోరా చాంట్స్, పవర్ పుల్ బీజీఎం ప్రేక్షకులకు గుస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. థమన్ సంగీతం కూడా మూవీకి ఫ్లస్ పాయింట్ అనే చెప్పాలి.

ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో హీరో ఆది పినిశెట్టి నటిస్తున్నారు. ఇప్పటికే పలు సినిమాల్లో నెగటివ్ రోల్స్‌లో మెప్పించిన ఆది.. బాలయ్య సినిమాలో ఏ విధంగా ఆకట్టుకోబోతున్నారో అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే హర్షాలి మల్హోత్రా, పూర్ణ, కబీర్ దుహాన్ సింగ్ వంటి పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇలా నార్త్ సౌత్ నటుల కలయికతో పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే.. ప్రేక్షకులకు కొత్త అనుభవం ఇవ్వాలని మేకర్స్ నిర్ణయించారు. అందుకే అఖండ 2 మూవీని (Akhanda 2 - Thaandavam) 3D వెర్షన్‌లో కూడా థియేటర్లలో విడుదల చేయనున్నారు. 3డీ విజువల్స్ బాలయ్య మాస్ స్కేల్ యాక్షన్‌కు కొత్త ఎక్స్పీరియస్ ఇస్తాయని భావిస్తున్నారు.
అఖండ 2 - తాండవం సినిమా విడుదల ముందు అభిమానులతో నేరుగా కనెక్ట్ కావడానికి బోయపాటి శ్రీను సోషల్ మీడియా చాట్ షోలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన అభిమానులతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా తన చిన్న కుమారుడు బోయపాటి వర్షిత్ ఈ సినిమాలో ఏ పాత్రలో కనిపించాడో మొదటిసారి వెల్లడించారు. ఇటీవల జరిగిన అఖండ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో వర్షిత్ మాట్లాడుతూ...' నమస్కారమండీ నాపేరు బోయపాటి వర్షిత్.. నేను ఈ సినిమాలో ఒక పాత్ర చేశాను. ప్లీజ్ మీ బ్లెసింగ్స్ కావాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన బోయపాటి గారికి ధన్యవాదాలు. బాలయ్య సార్ మూవీలో నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. జై బాలయ్య' అంటూ తమ ముద్దు మాటలతో అందర్నీ అట్రాక్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఆ రోజు ఏ పాత్రలో నటిస్తున్న వివరాలను బయటపెట్టలేదు.
తాజాగా డైరెక్టర్ బోయపాటి శ్రీను తన కుమారుడు పాత్రపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. వర్షిత్ 'భక్త ప్రహ్లాద'పాత్రను పోషించాడు. ట్రైలర్ లో జాగ్రత్తగా పరిశీలిస్తే.. ఆ చిన్నారి పాత్ర షాట్లను గుర్తించవచ్చు. సినిమాలో భక్త ప్రహ్లాద పాత్ర ఉంటుందని తెలియడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఈ పాత్ర కథలో ఏ విధంగా మిళితమైందో, పురాణాలతో అఖండ ఎలా భాగమైందో తెలుసుకోవడానికి మూవీ విడుదల వరకు వేచి చూడాల్సిందే. అలాగే.. మహా నరసింహా పాత్రలో ఎవరు నటించబోతున్నారు? బోయపాటి గత సినిమాల్లో పురాణాలు, ఆధ్యాత్మిక శక్తులు, ధర్మ అధర్మ పోరాటం వంటి కీలకాంశాలుగా ఉండగా, ఈసారి బాలయ్య పాత్రతో ఆ పురాణాలకు ఏ విధంగా లింక్ చేశారో అనేది కూడా ఉత్కంఠంగా మారింది.
ఇక బోయపాటి-బాలయ్య కాంబినేషన్ అంటే టాలీవుడ్‌లో ప్రత్యేక హంగామా. ఈసారి కాంబో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేయబోతుంది? మరోసారి బాక్సాఫీస్‌ను ఊచకోత కోస్తుందా? అన్న ప్రశ్నకు సమాధానం మాత్రం థియేటర్లలోనే లభించనుంది. ఆ ప్రశ్నలకు సమాధానం కొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











