Akhanda 2 Release: నందమూరి ఫ్యాన్స్‌కు శుభవార్త.. అఖండ 2 రిలీజ్‌కు లైన్ క్లియర్!
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం విడుదలకు అడ్డంకులు తొలిగాయి. ఎరోస్ ఇంటర్నేషనల్, ఇతర ఫైనాన్షియర్లతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొన రిలీజ్‌కు సిద్దమైంది. వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన ఈ చిత్రం విడుదల వాయిదా పడటం నందమూరి ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశను కలిగించింది. అయితే గత వారం రోజులుగా న్యాయపరమైన సమస్యలను, ఆర్థిక చిక్కులను పరిష్కరించుకొని విడుదలకు రెడీ అయినట్టు ఈ చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా రిలీజ్ డేట్ వివరాల్లోకి వెళితే..
అఖండ 2 చిత్రం విడుదలకు అన్నీ అడ్డంకులు తొలిగాయి. బాక్సాఫీస్ డివైన్ విధ్వంసానికి ముహుర్తం నిర్ణయించాం. అఖండ మాస్ పవర్‌ను డిసెంబర్ 12వ తేదీ నుంచి థియేటర్లలో అనుభూతిని పొందండి. డిసెంబర్ 11వ తేదీ నుంచి ప్రీమియర్లతో ఈ విధ్వంసం మొదలవుతుంది. త్వరలోనే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం అవుతాయి అని 14 రీల్స్ ప్లస్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అధికారికంగా ప్రకటించింది.

నట సింహ నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం అఖండ 2: తాండవం. బ్లాక్‌బస్టర్ సాధించిన అఖండ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాకు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
భారీ బడ్జెట్, హై ఆక్టేన్ యాక్షన్ సీన్లతో రూపొందుతున్న ఈ సినిమాకు ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సీ రామ్ ప్రసాద్, సంతోష్ డీ డీటాకే సినిమాటోగ్రఫిని, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్, తమ్మిరాజు ఎడిటర్‌గా, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు కోటి పర్చూరి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అయితే డిసెంబర్ 4 వ తేదీన ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేయాలంటూ ఎరోస్ ఇంటర్నేషన్ సంస్థ మద్రాస్ కోర్టును ఆశ్రయించడంతో వివాదంగా మారింది. రాత్రి వరకు ఎరోస్ సంస్థతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సినిమా నిరవధికంగా వాయిదా వేశారు. తాజాగా సమస్యలన్నీ పరిష్కారం కావడం ద్వారా నందమూరి అభిమానులకు శుభవార్తను అందించారు.
ఇదిలా ఉండగా, బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబో సింహా, లెజెండ్, అఖండతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లను అందించింది. వారి నాల్గవ కొలాబరేషన్ వస్తున్న సినిమా కావడం, ముఖ్యంగా బాలకృష్ణ వరుసగా నాలుగు హిట్లను సాధించడంతో అఖండ2 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మరింత బజ్ పెంచింది. సనాతన హైందవ ధర్మం బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రం మాస్, యాక్షన్, డివైన్ ఎలిమెంట్స్ తో గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది.


Click it and Unblock the Notifications











