తెలంగాణలో అఖండ 2 ప్రీమియర్లు రద్దు.. బాలకృష్ణ సినిమాకు హైకోర్టు షాక్
అఖండ 2 సినిమాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. నందమూరి బాలకృష్ణ నటించిన ఈ చిత్రం ఆర్థిక సమస్యలను చిక్కుకొని ప్రస్తుతం రిలీజ్‌కు సిద్దమైంది. అయితే టికెట్ రేట్ల పెంపు, ప్రీమియర్ల షో రేటు పెంచడంపై తెలంగాణ హై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సామాన్య ప్రేక్షకుడిపై భారం పడేలా అధిక రేట్లకు ఈ సినిమా టికెట్లను ఎందుకు అమ్ముతున్నారు? అని ప్రశ్నించింది. ఈ మేరకు ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్, సినీ నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది. దాంతో డిసెంబర్ 11వ తేదీన ప్రదర్శించే ప్రీమియర్ షోలు ప్రశ్నార్థకంగా మారాయి.

గతంలో భారీ బడ్జెట్ చిత్రాల టికెట్ రేట్లు, ప్రీమియర్ షోలకు రేట్లు పెంచకూడదని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినా ప్రభుత్వం జీవోలను ఎందుకు జారీ చేస్తున్నది? అని కోర్టు ప్రశ్నించింది. ఇదే తీరు కొనసాగితే.. కోర్టు ధిక్కారణ కింద కేసు నమోదు చేయాల్సి వస్తుంది అని కోర్టు అభిప్రాయపడింది.
ఇప్పటికే అఖండ 2 సినిమా ప్రీమియర్ల కోసం టికెట్లను ప్రేక్షకులు కొనుగోలు చేశారు. నైజాంల ఇప్పటికే పలు థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి. దాంతో ఈ ప్రీమియర్ల పరిస్థితి ఏంటనే విషయం అందరిలోనే నెలకొన్నది.


Click it and Unblock the Notifications











