Akhanda 2: బాలయ్య విధ్యంసం ఆపలేరు.. అఖండ 2 వాయిదాపై అభిమానుల ఆగ్రహం ..
Akhanda 2: నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన పాన్ ఇండియా మూవీ 'అఖండ 2: తాండవం'. టాలీవుడ్‌లో భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్దమైన ఈ మూవీ విడుదలకు చివరి క్షణంలో వాయిదా పడింది. డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అకస్మాత్తుగా నిలిపివేయడంతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు, ముఖ్యంగా బాలయ్య అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇప్పటికే ప్రీ-రిలీస్ ప్రమోషన్స్ పూర్తి కావడం, థియేటర్లలో షెడ్యూళ్లు ప్రకటించడం, బుకింగ్స్ ఓపెన్ కావడంతో అఖండ 2 విడుదల పండుగగా మారింది. కానీ, నిరావాధిక వాయిదా నిర్ణయం బాలయ్య ఫ్యాన్స్ కు ఊహించని షాక్ గా మారింది.
సింహా, లెజెండ్, అఖండ వంటి మూడు బ్లాక్‌బస్టర్ల తర్వాత మళ్లీ కలిసిన బాలయ్య-బోయపాటి శ్రీను కాంబోపై ఊహించని స్థాయిలో హైప్ నెలకొంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్, మాస్ రేంజ్ ఎలిమెంట్స్ సినిమా స్థాయిని మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. ముఖ్యంగా బాలయ్య ఆఘోర అవతారం సన్నివేశాలు మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుని అఖండ ఫ్రాంచైజీపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

భారీ హైప్ క్రియేట్ అయ్యాయి. డిసెంబర్ 4 రాత్రి చిత్రయూనిట్ మొదటగా ప్రీమియర్ షోలు టెక్నికల్ కారణాల వల్ల రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రేక్షకుల్లో కొంత అనుమానం మొదలైంది. అయితే కాసేపటికే పరిస్థితులు మరింత తీవ్రమై, నిర్మాతలు షెడ్యూల్ చేసిన తేదీన సినిమా విడుదల చేయలేమని ప్రకటించారు. ఈ ప్రకటనతో అఖండ 2 విడుదల వాయిదా పడినట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ మేరకు 14 రీల్స్ ప్లస్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో "అనివార్య పరిస్థితుల కారణంగా 'అఖండ 2'ను డిసెంబర్ 5న విడుదల చేయలేకపోతున్నాము. ఫ్యాన్స్‌కు, ప్రేక్షకులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు... సమస్య త్వరగా పరిష్కారం కావడానికి మా బృందం అవిశ్రాంతంగా పనిచేస్తోంది. త్వరలో పాజిటివ్ అప్డేట్ ఇస్తాము" అని పేర్కొన్నారు.
అఖండ 2 విడుదల అవుతున్నదనీ డిసెంబర్ 4 రాత్రి నుంచే ఫ్యాన్స్ పెద్ద ఎత్తున థియేటర్లకు చేరుకుని, ఉదయం షోల కోసం రెడీ అయ్యారు. అయితే తెల్లవారుజామున విడుదల వాయిదా వార్త బయటపడటంతో అభిమానులు ఆగ్రహావేశానికి గురయ్యారు. సోషల్ మీడియాలో అభిమానులు నిర్మాణ సంస్థపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.
ఓ అభిమాను ఆఘోర గెటప్ లో థియేటర్ కు వచ్చారు. సినిమా వాయిదా పడటంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. అతని భావోద్వేగాన్ని రికార్డు చేసి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 'కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి రా .. పాపం రా ఇలాంటోళ్ళ అభిమానం ఏం చేసింది రా నీకు' అంటు కామెంట్స్ పెడుతున్నారు. ' అఖండ 2 తేదీ మారవచ్చు, కానీ, విధి మారదు. బాలయ్య విజయాన్ని వాయిదా వేయబడింది. ఓటమి కాదు' అంటు మరికొందరూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరూ..'మేము ఏం పాపం చేస్తే దొరికారా మీరు' అంటూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఇక బాలయ్య డై హార్ట్ ఫ్యాన్స్ మాత్రం 'మా హీరో కష్టం ఏం అవుతుంది? అంటూ మూవీ మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని థియేటర్ల వద్ద బాలయ్య ఫ్యాన్స్ కంటతడి పెట్టిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.ఈ తరుణంలో వాయిదా వెనుక కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిర్మాతలు అనివార్య కారణాలు అని మాత్రమే చెప్పడంతో కారణాలపై అనేక రకాల చర్చలు ప్రారంభమయ్యాయి. టెక్నికల్ సమస్యలే ప్రధాన కారణమని ఓ వైపు సమాచారం.
మరోవైపు కొన్ని పేపర్లు కోర్టు సూచనలు, ఆర్థిక సమస్యలను కూడా ప్రస్తావిస్తున్నాయి. అయితే అధికారికంగా ఏ కారణాన్ని కూడా నిర్మాతలు స్పష్టంగా వెల్లడించలేదు. సినిమా ఎప్పుడొస్తుందనే ప్రశ్నార్థకంగా మారింది.


Click it and Unblock the Notifications











