అఖండ 2 ఇండస్ట్రీ వాళ్ళే తొక్కేస్తున్నారు.. బాలకృష్ణ మూవీపై నెగిటివిటీ అలా.. నిర్మాత ఆరోపణలు
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 చిత్రం టాలీవుడ్‌ను ఓ కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. గతంలో ఉన్న ఆర్ధిక పరమైన వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ న్యాయపోరాటం చేయగా.. అది అఖండ 2 చిత్ర విడుదల ఆగిపోయేలా చేసింది. మద్రాస్ హైకోర్ట్ ఆదేశాల మేరకు డిసెంబర్ 4వ తేదీ రాత్రి పడాల్సిన ప్రీమియర్స్ సహా, డిసెంబర్ 5వ తేదీన అఖండ 2 సినిమా విడుదలను నిరవధికంగా నిలుపుదల చేస్తున్నట్లు 14 రీల్స్ ప్లస్ సంస్థ ప్రకటించడంతో బాలయ్య అభిమానులు షాక్ అయ్యారు.
ఈ వివాదాన్ని పరిష్కరించడానికి టాలీవుడ్ పెద్దలంతా రంగంలోకి దిగారు. ఎట్టకేలకు అన్ని రకాల అవాంతరాలను అధిగమించి అఖండ 2 చిత్రం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది. డిసెంబర్ 11న భారత్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ ప్రీమియర్స్ ప్రదర్శితమయ్యాయి. ఆ తర్వాత డిసెంబర్ 12న రిలీజ్ నాడు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో చిత్ర యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంది. ఈ సందర్భంగా 14 రీల్స్ ప్లస్ సంస్థ అధినేతలు రామ్ అచంట, గోపీ అచంట మీడియా ముందుకు వచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు.

బాలయ్యకు క్షమాపణలు
కొన్ని కారణాల కారణంగా అఖండ 2 చిత్రం ఒక వారం వాయిదా వేయాల్సి వచ్చింది. అందుకు బాలయ్య బాబుగారికి, దర్శకుడు బోయపాటి శ్రీనుగారికి, బాలయ్య బాబు ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెబుతున్నాం. ఇది ఊహించని వివాదం.. ఈ సమస్యను పరిష్కరించడానికి మ్యాంగో మాస్ మీడియా రామ్ గారు, దిల్‌రాజు గారు చాలా సపోర్ట్ చేశారు. వాళ్లకు థ్యాంక్స్. ఒక వారం లేట్ అయినప్పటికీ డిసెంబర్ 11న అఖండ 2 తాండవం ప్రీమియర్స్‌తో రిలీజ్ అయ్యింది. బ్రహ్మాండంగా రెస్పాన్స్ వచ్చింది ప్రీమియర్స్‌కి. ఫ్యాన్స్ అయితే నేను భ్రమరాంబలో చూశాను. ఫ్యాన్స్ అయితే అసలు కుర్చీలో కూర్చోవడం లేదు. అరుపులు, చప్పట్లు, విజిల్స్‌తో రెస్పాన్స్ బాగుంది. అన్ని ఏరియాల నుంచి కలెక్షన్స్, రిపోర్ట్స్ వచ్చాయని గోపీ అచంట తెలిపారు.
ప్రీమియర్స్‌కు రికార్డ్ కలెక్షన్స్
అఖండ 2 ప్రీమియర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆంధ్రా, నైజాం, సీడెడ్ ఏరియాలలో ప్రీమియర్స్‌కు 10 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. బెంగళూరు, కర్ణాటకలో కూడా కోటి రూపాయల నెట్ రాబట్టింది. నాన్ కర్ణాటక చిత్రాలలో అఖండ 2ది ఐదో స్థానం. బుకింగ్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ఈ వీకెండ్‌కు కుటుంబ ప్రేక్షకుల ఆదరణ బాగుంటుంది. సినిమా వాయిదా పడటం వల్ల ఓవర్సీస్‌లో థియేటర్స్ సంఖ్యను తగ్గించాల్సి వచ్చింది. అన్ని థియేటర్స్‌లో పడుంటే బాగుండేది. టాక్ వల్ల ఇవన్నీ కవరై ఆక్యూపెన్సీ సూపర్‌గా ఉంది. ఈ వీక్ మొత్తం అలా కంటిన్యూగా వెళ్తుందని అంటున్నారు. సీక్వెల్‌కి ఎప్పుడూ బరువు ఉంటుంది. ఫ్యాన్స్ నుంచి ఎక్కడా నెగిటివీటీ లేదు.. కొద్దిగా ఇండస్ట్రీలో ఉంది. బయటి ఆడియన్స్‌లో అది లేదు. ఇండస్ట్రీలో మిక్స్‌డ్‌గా ఉంది. గ్రౌండ్ లెవల్ రిపోర్ట్స్ మాత్రం చాలా ఎక్స్‌లెంట్‌గా ఉన్నాయి. రివ్యూలు అంటే ఎవరి ఓపీనియన్ వాళ్లది, ఎవరినీ తప్పుబట్టడానికి లేదు అని రామ్ అచంట వెల్లడించారు.
నార్త్‌లోనూ సాలీడ్ రెస్పాన్స్
ప్రతి ఫైట్‌లోనూ సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి.. అవి వచ్చినప్పుడు మాత్రం ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను భ్రమరాంబలో చూశాను ఫ్యాన్స్‌తో. నార్త్‌లో దాదాపు 800 స్క్రీన్స్‌లో రిలీజ్ చేశాం.. ఇవాళ మార్నింగే మాట్లాడాను.. దాదాపు 30 శాతం ఆక్యూపెన్సీతో స్టార్ట్ అయినట్లు చెప్పారు. జీ వాళ్ల ద్వారా అఖండ 2ను నార్త్‌లో రిలీజ్ చేశాం.. వాళ్లు కూడా షో చూశారు.. చూస్తున్నప్పుడు త్రిశూలం తిరిగే సీన్ కానీ, శివుడి తాండవం, ఆంజనేయ స్వామి వచ్చినప్పుడు రెస్పాన్స్ మామూలుగా లేదు. ఇది మరింత పెరుగుతుంది.. 30 శాతం ఆక్యూపెన్సీతో స్టార్ట్ అవ్వడం అనేది అరుదుగా జరుగుతుందని అక్కడి వాళ్లు చెబుతున్నారు. ఇంకా ఎలాంటి స్ట్రాటజీ వాడాలనేది డిస్కష్ చేసుకుంటున్నాం. ఈ వివాదంలో చిత్ర పరిశ్రమ నుంచి మద్దతు లభించింది. దిల్‌రాజు గారు ముందుండి అన్ని చోసుకున్నారు. మ్యాంగో రామ్ గారు కూడా బాగా హెల్ప్ చేశారు. అర్ధరాత్రి ఒంటి గంటల, రెండు గంటల వరకు డిస్కషన్స్ చేశాం. దీనికి తోడు తెలంగాణలో టికెట్ రేట్లపై కోర్టుకు వెళ్లడం, దీనిపై కోర్టు ఇంజెక్షన్ ఇవ్వడం. మళ్లీ దానిని ఇవాళ కొట్టేశారు. వరుసగా స్పీడ్ బ్రేకర్స్‌ను దాటుకుంటూ వచ్చామని గోపీ అచంట తెలిపారు.


Click it and Unblock the Notifications











