హైవేపై లారీకి ఎదురెళ్లగలమా... Akhanda 2 రిలీజ్‌పై టాప్ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ 2 విడుదల విషయంలో వివాదం చోటు చేసుకుని రిలీజ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే సినీ పెద్దలు రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించారు. అన్ని ఇబ్బందులను దాటుకుని డిసెంబర్ 12న అఖండ 2 ప్రేక్షకుల ముందుకు వస్తుందని 14 రీల్స్ ప్లస్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అలాగే డిసెంబర్ 11న ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.

అఖండ 2తో 16 సినిమాలపై ప్రభావం
అయితే ఈ శుక్రవారం అఖండ 2 రావడం చిన్న సినిమాలకు ఇబ్బందులు కలిగించింది. డిసెంబర్ 5న అఖండ వస్తుందనే గ్యారెంటీతో డిసెంబర్ 12న ఏకంగా 16 సినిమాలు రిలీజ్ పెట్టుకున్నాయి. వీటిలో మోగ్లీ, సైక్ సిద్ధార్ధ్, అన్నగారు వస్తారు, ఈషా, సకుటుంబానాం, నా తెలుగోడు, ఇట్స్ ఒకే తదితర చిత్రాలు కూడా ఉన్నాయి. మోగ్లీ, సైక్ సిద్ధార్ధ్, అన్నగారు వస్తారు, ఇట్స్ ఓకే సినిమాలపై బజ్ నెలకొన్న సంగతి తెలిసిందే.

Akhanda 2 Release Bunny Vasu makes shocking comments on Nandamuri Balakrishna movie s impact

ఈషా ట్రైలర్‌కు రెస్పాన్స్
అఖండ 2 ఎఫెక్ట్‌తో వీటిలో కొన్ని సినిమాలు తమ విడుదలను వాయిదా వేసుకున్నాయి. తాజాగా అఖండ 2 రిలీజ్‌పై సినీ నిర్మాత బన్నీ వాసు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన నిర్మాణంలో ఈషా తెరకెక్కింది. హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో నిర్మితమైన ఈ సినిమాలో హెబ్బా పటేల్, త్రిగుణ్ తదితరులు కీలకపాత్రలు పోషించగా.. శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించారు. తాజాగా ఈషా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు నిర్మాతలు బన్నీ వాసు, కేఎల్ దామోదర ప్రసాద్‌లు సమాధానాలు ఇచ్చారు.

జై బాలయ్య అనాల్సిందే
పెద్ద హీరోతో సినిమా తీసినా.. మేం 2 కోట్ల రూపాయలతో తీసినా అది కూడా వ్యాపారమే. కానీ ఒక పెద్ద సినిమా వస్తుందంటే జనంలో ఉన్న ఉత్సాహం చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్లకు వున్న ఫ్యాన్ బేస్, మరొకటి కానీ దీనికి కారణం. జరిగిందేదో దురదృష్టవశాత్తూ జరిగిపోయింది. 12వ తేదీన నా సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. డిసెంబర్ 5న అఖండ 2 రావడం నా లాంటి వారికి ఇబ్బందికరమే. ఇండస్ట్రీలో ఎవరి బిజినెస్ వాళ్లదే. ఛాంబర్‌లో వందల కొద్ది పరిష్కారాలు మాట్లాడుకుంటాం. నెల రోజులు గడిచిన తర్వాత మళ్లీ మామూలే. సినీ పరిశ్రమ అనేది సరైన అన్‌ ఆర్గనైజ్డ్, ఇక జై బాలయ్య అనాల్సిందేనని నిర్మాత దామోదర్ ప్రసాద్ అన్నారు.

అఖండ 2 ఎఫెక్ట్ ఉంది
ఈ బిజినెస్‌లో చిన్న సినిమాకు సేఫ్టీ కోరుకుంటాం కదా. ఆ లైన్‌లో మేం వెళ్లాల్సిందే. దాని గురించి ఎవరికి ఏం చెప్పాల్సిన పనిలేదు. అఖండ 2 ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. 12వ తేదీ 16 సినిమాలు రిలీజ్ పెట్టుకున్నాయి. అఖండ 2 ఐదో తారీఖున రావాల్సింది. ఇప్పుడు 12న రావడం వల్ల 16 మంది ఏదో రకంగా తమ డేట్స్‌ని మార్చుకుంటున్నారు కదా. ఈ పరిస్ధితిని ఎదుర్కొని ముందుకు వెళ్లాల్సిందేనని దామోదర్ ప్రసాద్ పేర్కొన్నారు.

పెద్ద లారీకి ఎదురెళ్లకూడదు
ఆ వెంటనే మరో నిర్మాత బన్నీ వాసు మైక్ అందుకున్నారు. హైవే మీద మనం చిన్నకారు వేసుకుని వెళ్తున్నాం, వెనకాల ఓ పెద్ద లారీ వచ్చి హారన్ కొట్టింది. ఏం చేస్తాం.. సైడ్ తప్పుకోవాలి. లేదు కాదు అని అలాగే ముందుకెళ్తే వెనుక నుంచి ఓ డాష్ ఇస్తే ఎక్కడో వెళ్లి పడతాం. అందుకే సైడ్ ఇచ్చి పెద్ద బండిని వదిలేయడమే బెటర్ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బన్నీ వాసు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X