Akhanda 2 రిలీజ్ చేస్తారా? మా డబ్బు తిరిగిస్తారా.. బాలయ్య నిర్మాతలకు టాప్ ప్రొడ్యూసర్ అల్టీమేటం

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ అఖండ 2. ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో అఖండ 2 కూడా ఒకటి. గతంలో వచ్చిన అఖండకు సీక్వెల్‌గా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. పాన్ ఇండియా మూవీగా డిసెంబర్ 5న విడుదల కావాల్సిన అఖండ 2 .. లాస్ట్ మినిట్‌లో అనూహ్యంగా ఆగిపోవడంతో చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది.

ఎరోస్‌తో అఖండ 2 నిర్మాతలకు వివాదం
అఖండ 2 నిర్మాణ సంస్థ అయిన 14 రీల్స్ ప్లస్ సంస్థకు ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు పాత బకాయిల విషయంలో వివాదం నడుస్తోంది. తమకు చెల్లించాల్సిన బాకీ మొత్తాన్ని చెల్లించకపోవడంతో ఎరోస్ సంస్థ.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అఖండ 2 సినిమా విడుదలపై స్టే విధించింది. దీంతో డిసెంబర్ 4వ తేదీ రాత్రి ప్రదర్శించాల్సిన ప్రీమియర్స్ సహా డిసెంబర్ 5న మెయిన్ రిలీజ్‌పై ఎఫెక్ట్ పడింది. కోర్టు నిర్ణయంతో అఖండ 2ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు 14 రీల్స్ ప్లస్ సంస్థ ప్రకటించింది. నాటి నుంచి ఈ సమస్యను పరిష్కరించడానికి టాలీవుడ్ పెద్దలు దిల్‌రాజు, సురేష్ బాబు సహా పలువురు రంగంలోకి దిగి ఇరువర్గాలతో చర్చలు జరుపుతున్నారు. తాజాగా అఖండ 2 విడుదలపై ప్రముఖ నిర్మాత నట్టికుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Akhanda 2 Release Postponement Natti Kumar s Strong Remarks on Eros International 14 Reels Dispute

బాలయ్యకి ఒక్కమాట చెప్పాల్సింది
ఓ న్యూస్ ఛానెల్‌తో నట్టికుమార్ మాట్లాడుతూ.. డబ్బును రాబట్టుకోవడానికి పలు మార్గాలు ఉన్నాయి. కానీ సినిమా రిలీజ్‌ను ఆపడం కరెక్ట్ కాదు. ఈ నష్టాన్ని భర్త చేయడానికి పెద్దలు మాట్లాడాలి. సినిమా రిలీజ్‌పై క్లారిటీ లేదు. ఏ షో పడుతుందో తెలియక అభిమానులు థియేటర్ దగ్గరే నిరీక్షిస్తున్నారు. పాత బాకీ వసూలు చేయడానికి చట్టపరంగా వాళ్లు కోర్టుకు వెళ్లారు, దానిని అడిగే రైట్ మనకి లేదు. ఎరోస్ వాళ్లు గతంలో బాలయ్య బాబుతో సినిమా చేశారు. బాలకృష్ణతో మంచి ర్యాపో ఉంది.. వాళ్లు కూడా బాలయ్యకి కనీసం ఓ మాట చెప్పకుండా ఎందుకు ఇది జరిగిందో అర్ధం కావడం లేదు. వాళ్లెందుకు స్టే వరకు వెళ్ళి సినిమా ఆపారో తెలియడం లేదు. నిర్మాతలు బాలయ్యకు బాబుకు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా అని నట్టి కుమార్ వ్యాఖ్యానించారు.

మాటకు కట్టుబడాల్సిందే
బాలయ్య, బోయపాటిలు భారీ రెమ్యునరేషన్ తీసుకోవడం వల్లే అఖండ 2 బడ్జెట్ పెరిగిపోయిందన్న ప్రచారంపై నట్టికుమార్ స్పందిస్తూ.. ప్రొడ్యూసర్ ఇష్టపడే ఆయనతో సినిమా తీశాడు, డిస్ట్రిబ్యూటర్ ఇష్టపడే సినిమా కొనుక్కున్నాడు కదా? మరి ఎగ్జిబిటర్ .. డిస్ట్రిబ్యూటర్‌‌కు డబ్బులు ఇచ్చాడు. టేబుల్ ప్రాఫిట్ ఉందని నేను చెబుతున్నా.. బాలయ్య తీసుకున్న రెమ్యునరేషన్‌కి టేబుల్ ప్రాఫిట్ వచ్చింది కదా? బాలయ్య, బోయపాటిలను చూసే ఇచ్చారు కదా? ప్రొడ్యూసర్ ముఖం, నా ముఖం చూసి ఇవ్వలేదు కదా? సినిమా ఆల్రెడీ టేబుల్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు డిస్కష్ చేయకూడదు. మొదట ఇచ్చేటప్పుడు దేవుడు అంటాం.. కష్టం వచ్చినప్పుడు దెయ్యం అంటే ఎలా? ఇచ్చేటప్పుడు ఏ మాట చెప్పామో దానికి కట్టుబడి ఉండాలని నట్టికుమార్ సూచించారు.

వీరమల్లు సమయంలో పవన్ రిస్క్
హరిహరి వీరమల్లుకు కూడా ఇలాంటి పరిస్ధితే ఎదురైందని ఆ సమయంలో పవన్ కళ్యాణ్ అండగా నిలిచారని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. అది ఐదేళ్లు పట్టింది, కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి, ఆ నిర్మాతకు పవన్ కళ్యాణ్‌కు మంచి హిట్స్ ఉన్నాయి కాబట్టి.. నా కోసం ఇబ్బంది పడకూడదు, సినిమా ఆగకూడదని పవన్ రిస్క్ తీసుకుని సినిమాను విడుదల చేసిన మాట వాస్తవమే. ఇంకోకరి డబ్బు ఎవరైనా ఎందుకు పెడతారు? ఎవరి ఇష్టం వాళ్లది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం.. కొంత రెమ్యునరేషన్‌ని వాళ్లు వదులుకున్నారని అంటున్నారు. వదులుకున్నా కూడా సినిమా ఇబ్బంది పడిందని అంటున్నారు. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియదు అని నట్టికుమార్ తెలిపారు.

ఎగ్జిబిటర్స్ డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే
ఒక్కమాట చెబితే 5 నిమిషాల్లో అయిపోయే పని, అర్ధగంటలో అయిపోయే పని ఇంతదాకా లాగడం, సినిమా ఆగడం కరెక్ట్ కాదు. ఆగుతుందని కలలో కూడా ఊహించలేదు. నేను కూడా డబ్బులిచ్చాను, నేను కూడా ఎగ్జిబిటర్‌కు డబ్బులిచ్చాను, నా ఫ్రెండ్స్ డబ్బులిచ్చారు.. అందరూ డబ్బులిచ్చారు. నాతోటి ఎగ్జిబిటర్ డబ్బులు ఇచ్చారు.. సినిమా రిలీజ్ అవుతుందని బాలయ్య బాబుని, బోయపాటిని, ప్రొడ్యూసర్‌ని నమ్మే ఇచ్చాం. సినిమా ఆగుతుందంటే ఎవరైనా ఇస్తారా? సినిమా బాగుంది, మంచి హిట్. ఇప్పటికి కూడా చెబుతున్నా.. ఎప్పుడు రిలీజ్ అయినా బాలయ్య బాబు రికార్డులు బద్ధలు కొడతాడు. పూనకాలే, పూనకాలు అని నట్టికుమార్ అన్నారు.

కంటెంట్ లోడ్ అయిపోయింది. ఏ టైమ్‌లో బయటికి వచ్చినా ఇబ్బంది పడతాం. కాబట్టి తక్షణం సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేయాలి. లేదంటే ఎగ్జిబిటర్ డబ్బులు వాపస్ చేయడానికి ప్లాన్ చేయాలి. ఒకవేళ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి అభిమానుల కళ్లలో ఆనందం చూడాలి. అది ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు ఉదయం క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ ఇవ్వలేకపోతే.. ఎగ్జిబిటర్ డబ్బులు ముందు వాపస్ చేసి, ఆ తర్వాత మీరు ఏ డేట్ అనేది చెబితే అభిమానులు ఆనందపడతారు అని నట్టికుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు చిత్రసీమలో కలకలం రేపుతున్నాయి. మరి అఖండ 2 నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటరో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X