Akhanda 2: అఖండ 2లో గూస్‌బంప్స్ మోమోంట్ ఇదే.. శివుడిగా విశ్వరూపం చూపిన ఆ నటుడెవరు?
Akhanda 2: నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్-డివోషనల్ ఎంటర్టైనర్ 'అఖండ 2: తాండవం' (Akhanda 2 Tandavam). భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీకి మంచి స్పందన వస్తుంది. తొలి భాగం 'అఖండ' సృష్టించిన సెన్సేషన్‌కు కొనసాగింపుగా వచ్చిన ఈ సీక్వెల్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల అనంతరం ఆ అంచనాలను నిజం చేస్తూ సినిమా మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా బాలయ్య నట విశ్వరూపం, పవర్‌ఫుల్ డైలాగ్స్, రుద్ర తాండవం వంటి యాక్షన్ సన్నివేశాలు బాలయ్య అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. అయితే.. ఈ మూవీ శివుడి పాత్ర బాలయ్యనే డామినేట్ చేసేలా ఉంది. ఇంతకీ శివుడి పాత్రధారి ఎవరు?
అఖండ 2: తాండవంలో బాలకృష్ణను దర్శకుడు బోయపాటి శ్రీను మరింత ఎలివేటెడ్ క్యారెక్టర్‌లో చూపించాడు. అఘోర లుక్, ఉగ్రరూపం, హావభావాలు, పవర్ పుల్ యాక్షన్ సన్నివేశాల్లో బాలయ్య చూపించిన ఇన్టెన్సిటీ సినిమాకే ప్రధాన బలం అని చెప్పొచు. వాస్తవానికి బోయబాటి - బాలయ్య సినిమా అంటే.. లాజిక్ లను పక్కన బెట్టిన వారి చేసే మ్యాజిక్ చూడాల్సిందే. ఈ కాంబో ఎక్కువ
మాస్ ఎలివేషన్లకు ప్రాధాన్యం ఇస్తుందనే విషయం తెలిసిందే. ఈ మూవీలో కూడా బోయపాటి తన మార్క్ టేకింగ్‌తో, బాలయ్య పాత్రను దాదాపు ఓ సూపర్ హ్యూమన్ గా క్రియేట్ చేశారనే చెప్పాలి. అందుకు తగ్గట్టుగానే బాలయ్య పాత్ర ఎనిమిది సంవత్సరాలు కఠోర తపస్సు చేసినట్టు చూపించారు.

ఇదిలా ఉంటే.. 'అఖండ 2: తాండవం'లో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పరమేశ్వరుడి పాత్ర. తొలి భాగం 'అఖండ'లో శివుడి ప్రస్తావన ప్రతీకాత్మకంగా మాత్రమే ఉండగా, ఈ సీక్వెల్‌లో ఆ భావన మరింత విస్తరించింది. ఈసారి ఏకంగా కైలాసం నుంచి పరమేశ్వరుడు భూమికి దిగివచ్చే ఘట్టాన్ని చూపించడం ఆధ్యాత్మికతత్వాన్ని మరింత పెంచినట్టు అయింది. కథలో అఖండ తల్లి మరణించే సందర్భంలో వచ్చే ఈ సన్నివేశం సినిమాకే హైలైట్‌గా నిలుస్తోంది.
ఈ సన్నివేశంలో కైలాసంలో ఉన్న శివుడు స్వయంగా భూమిపైకి వచ్చి అఖండ తల్లి చితికి అగ్నిసంస్కారం చేసినట్టు చూపించారు. ఈ సీన్ ను దర్శకుడు బోయపాటి అత్యంత భక్తిభావంతో, గ్రాండ్ విజువల్ తో తెరకెక్కించారు. అలాగే.. ఆ సీన్ కు తగ్గట్టుగా తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ కలిసొచ్చి థియేటర్లలోని ప్రతి ప్రేక్షకుడికి గూస్ బంప్స్ వచ్చేలా చేస్తున్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. వెంటనే ఆ సీన్ ముగిసిన తర్వాత చప్పట్లతో థియేటర్లు మార్మోగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.
ఈ కీలక ఘట్టంలో శివుడి పాత్రలో నటించింది బాలీవుడ్ నటుడు తరుణ్ ఖన్నా (Tarun Khanna). హిందీ టెలివిజన్ ప్రేక్షకులకు శివుడిగా ఇప్పటికే సుపరిచితుడైన తరుణ్ ఖన్నా, ఈ సినిమాలోనూ అదే గంభీరతతో పరమేశ్వరుడి పాత్రలో ఒదిగిపోయారు. ఆయన తెరపై కనిపించిన ప్రతిసారి గూస్‌బంప్స్ రావడం ఖాయమని ప్రేక్షకుల అభిప్రాయం. తరుణ్ ఖన్నా 2015లో ప్రసారమైన మైథలాజికల్ సీరీస్ 'సంతోషి మా'లో తొలిసారి శివుడిగా నటించి మంచి పేరు సంపాదించారు. ఆ తర్వాత 'కర్మఫల్ దాత శని', 'పరమావతార్ శ్రీ కృష్ణ', 'శ్రీమద్ రామాయణ', ప్రస్తుతం ప్రసారమవుతున్న 'కాల్ భైరవ రక్షక్ శక్తిపీఠ్ కే' వంటి పలు సీరియల్స్‌లోనూ శివుడి పాత్రను పోషించారు. శివుడిగా ఆయనకు ఉన్న అనుభవమే 'అఖండ 2'లో ఆ పాత్రను మరింత నమ్మకంగా చూపించేందుకు ఉపయోగపడిందని చెప్పాలి.
బాలకృష్ణతో తరుణ్ ఖన్నాకు నేరుగా సంభాషణ సన్నివేశాలు లేకపోయినా, క్లైమాక్స్‌లో ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించే ఘట్టం ప్రేక్షకులను ఉత్సాహపరుస్తోంది. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులకు శివుడిగా తరుణ్ ఖన్నా పరిచయం ఉండటంతో, ఈ పాత్ర సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో మరింత కనెక్ట్‌ను తీసుకొస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా బాలకృష్ణ నట విశ్వరూపానికి తోడు, పరమేశ్వరుడిగా తరుణ్ ఖన్నా ఇచ్చిన ఎలివేషన్'అఖండ 2: తాండవం'ను భక్తి, పవర్, మాస్ ఎలిమెంట్స్ కాంబోగా మార్చేశాయనే చెప్పాలి. అయితే.. కొన్ని చోట్ల మిక్స్డ్ టాక్ రావడంతో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











