Akhanda 2 Teaser: అభిమానులకు బాలయ్య బర్త్ డే ట్రీట్.. అఖండ 2 టీజర్ రిలీజ్‌ డేట్ లాక్!

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సినిమాల విషయంలో దూకుడుగా వెళ్లిపోతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి డాకు మహారాజ్‌గా అలరించిన ఆయన తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 చేస్తున్నారు. బాలయ్య - బోయపాటి కాంబోతో పాటు బ్లాక్‌బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్న బాలయ్య త్వరలోనే అఖండ 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.

వరుస హిట్స్‌తో ఊపులో బాలయ్య
అఖండ, వీరసింహారెడ్డి , భగవంత్ కేసరి లేటెస్ట్‌గా ఈ సంక్రాంతికి డాకు మహారాజ్‌తో వరుస విజయాలతో మంచి ఊపులో ఉన్నారు బాలయ్య. ఈ క్రమంలోనే అఖండకు సీక్వెల్‌గా అఖండ 2ని మొదలుపెట్టేశారు. మహాకుంభమేళాలో ఈ సినిమా షూటింగ్‌ను దర్శకుడు బోయపాటి శ్రీను అధికారికంగా మొదలుపెట్టారు. నాటి నుంచి వరుస షెడ్యూల్స్‌తో షూటింగ్ పరుగులు పెట్టిస్తున్నాడు బోయపాటి. ఆ తర్వాత హిమాలయాల్లోని అందమైన లోకేషన్‌లలో అఖండ 2 చిత్రీకరణ జరిపాడు. రామ్ - లక్ష్మణ్‌లు సెట్ చేసిన ఓ పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌ని బాలయ్య అద్భుతంగా చేసినట్లు ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి.

Akhanda 2 Teaser Release Nandamuri Balakrishna Boyapati Srinu Movie s First Glimpses Coming Soon

కుమార్తె తేజస్విని సమర్పణలో బాలయ్య
14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచంట, గోపీచంద్ అచంట సంయుక్తంగా అఖండ 2 చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలకృష్ణ చిన్న కుమార్తె నందమూరి తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. దసరా కానుకగా ఈ ఏడాది సెప్టెంబర్ 25న పాన్ ఇండియా లెవల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. బాలయ్య ఆస్థాన సంగీత దర్శకుడు థమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఆది పినిశెట్టి, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

అఖండ 2కు అదిరిపోయే బిజినెస్?
ఇక సెట్స్ మీద ఉండగానే అఖండ 2 ప్రీ రిలీజ్ బిజినెస్‌కు దుమ్మురేపుతున్నట్లుగా ఊహాగానాలు వినిసిస్తున్నాయి. ఈ సినిమా థియేట్రికల్, శాటిలైట్, ఓటీటీ రైట్స్ సొంతం చేసుకునేందుకు బడా సంస్థలు క్యూకడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో కొందరు స్టార్స్ అతిథి పాత్రలు పోషిస్తారని కూడా గాసిప్స్ వినిపిస్తున్నాయి. యానిమల్ విలన్ బాబీ డియోల్ సోదరుడు, బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీడియోల్ ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తారని టాక్. గదర్ 2, జాట్ సినిమాలతో మంచి ఊపులో ఉన్న సన్నీ కనుక అఖండ 2లో నటిస్తే హిందీ జనాలు ఊగిపోతారని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఇందులో సన్నీ నటిస్తున్నారా? లేదా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

అఖండ 2 టీజర్‌కు ముహూర్తం ఫిక్స్
అయితే అప్పుడెప్పుడో ఓ పోస్టర్ తప్పించి నేటి వరకు అఖండ 2కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో నందమూరి అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కి చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 10న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. జూన్ 9 సోమవారం సాయంత్రం 6.03 నిమిషాలకు అఖండ 2 టీజర్ తాండవం ఉంటుందని పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అఖండ 2 టీజర్ ఎలా ఉండబోతుందోనన్న చర్చ మొదలైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X