Akhanda 2 Teaser Review: అఖండ 2 టీజర్ రివ్యూ.. యుముడు కూడా కన్నెత్తి చూడడు!
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న అఖండ 2: తాండవం సినిమా రిలీజ్‌కు ముందే సంచనాలు క్రియేట్ చేస్తున్నది. ఖండి సినిమాకు ఈ చిత్రం సీక్వెల్‌గా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను 14 రీల్స్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మాత రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మిస్తున్నారు.ఈ సినిమాను నందమూరి తేజస్విని సమర్పించడం విశేషంగా మారింది. ఇక ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయితే నట సింహం బాలయ్య బర్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. ఆ టీజర్ గురించిన రివ్యూ వివరాల్లోకి వెళితే...
అఖండ 2: తాండవం మూవీ టీజర్ విషయానికి వస్తే.. మంచు పర్వతాల్లో అఘోరా రూపంలో ఉండే బాలకృష్ణ అగ్రహ రూపంతో బయటకు వచ్చి..నా శివుడు అనుమతి లేనిదే.. E యుముడు కూడా నావైపు కన్నెత్తి చూడడు.. అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ తన చేతిలో ఉన్న శూలాన్ని మెడ చుట్టూ తిప్పడంతో తన వైపు దూసుకొచ్చిన నలుగురు గుండాలను అది నరికి వేసే సీన్ గూస్ బంప్స్ తెచ్చేలా ఉంది. బోయపాటి ఆ సీన్‌ను బాగా చిత్రీకరించాడు.

ఇక టీజర్‌లోని రెండో షాట్‌లో యాగం జరుగుతున్న సమయంలో పై నుంచి ఏదో పడి విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే.. బాలయ్య తన కాలితో దానిని భస్మం చేసే తీరు హై ఎనర్జీతో పవర్‌ఫుల్‌గా ఉంది. ఈ టీజర్‌లోని రెండు మూడు అంశాలు ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అనే విషయాన్ని రుచి చూపించాయి. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ మరోసారి హిట్ కొట్టడం గ్యారెంటీ అనే సంకేతాలు అందించింది.
అఖండ 2 టీజర్‌లో తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కేక పెట్టించేలా ఉంది. తాండవం అంటూ పలికించిన బీజీఎం సన్నివేశాలకు వెయ్యిరెట్ల బలాన్ని ఇచ్చిందా అనిపించింది. మరోసారి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోరుకు బాక్సులు బద్దలు కావాల్సిందే అనే ఫీలింగ్ కలిగింది. ఇక గ్రాఫిక్ వర్క్ కూడా హై స్టాండర్డ్స్‌లో ఉంది. ఈ టీజర్ సినిమాపై రెండితలు అంచనాలు పెంచేలా కనిపించింది.
అఖండ 2 సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ఈ టీజర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకులకు అందించనున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ దసరా నందమూరి అభిమానులకు నిజమైన పండగను తీసుకొస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.
అఖండ 2 సినిమా సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. సీ రాంప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ వర్క్, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు.ఈ సినిమాలోని విజువల్స్ గురించి ఇప్పటికే చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ అప్ డేట్స్ గురించి ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











