Akhanda 2 Teaser: నా బావ ఏం కొట్టాడంటే... బాలయ్య, బోయపాటి విధ్వంసమే.. గోపిచంద్ మలినేని రివ్యూ
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న అఖండ 2: తాండవం సినిమా రిలీజ్‌కు ముందే సంచనాలు క్రియేట్ చేస్తున్నది. ఖండి సినిమాకు ఈ చిత్రం సీక్వెల్‌గా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను 14 రీల్స్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మాత రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మిస్తున్నారు.ఈ సినిమాను నందమూరి తేజస్విని సమర్పించడం విశేషంగా మారింది. ఇక ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్నారు.
అయితే నట సింహం బాలయ్య బర్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను అభిమానులకు కానుకగా అందించనున్నారు. అయితే జూన్ 9వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో రిలీజ్ చేయనున్న ఈ టీజర్ గురించి సెన్సేషనల్ అప్ డేట్‌ను దర్శకుడు మలినేని గోపిచంద్ ఇచ్చి నందమూరి ఫ్యాన్స్ మరింత జోష్ పుట్టించారు. ఈ సినిమా టీజర్ గురించి ఆయన ఏం చెప్పారంటే...

నందమూరి బాలకృష్ణ జన్మదినం జూన్ 10వ తేదీ. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక రోజు ముందే అఖండ 2 సినిమా టీజర్‌ను అందిస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా టీజర్ గురించి ఇచ్చిన అప్‌డేట్‌లో నంది, డమరుకంతో పోస్టర్ రిలీజ్ చేసి మంచి డివోషనల్ టచ్ ఇచ్చారు. అయితే ఈ సినిమా టీజర్‌ను ముందే చూసిన గోపిచంద్ మలినేని ట్వీట్ చేసి అంచనాలు మరింతగా పెంచాడు.
అఖండ 2 టీజర్ గురించి చెబుతూ.. ఇప్పుడే చూశాను. అది పవర్‌ఫుల్ మాత్రమే కాదు. గొప్ప అనుభూతిని, అధ్యాత్మికతను తెలియజెప్పేలా ఉంది. నా బావ తమన్ ఇచ్చిన బీజీఎం వింటే మైండ్ బ్లాంకే. తాండవం అంటే అదేనా అనే విధంగా మ్యూజిక్ ఉంది. టీజర్‌లోని ఒక్క షాట్ నాకు ఎంత హై ఇచ్చిందంటే మాటల్లో చెప్పలేను. ఒంటి మీద రోమాలు నిక్కబొడిచాయి. ఇంకా ఆ అనుభూతి నుంచి బయటకు రాలేకపోతున్నా. ఒక్క మాటలో చెప్పాలంటే.. బాలయ్య, బోయపాటి విధ్వంసమే.. జై బాలయ్య అంటూ ట్వీట్‌లో గోపిచంద్ మలినేని పేర్కొన్నారు.
అఖండ 2 సినిమా సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. సీ రాంప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ వర్క్, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు.ఈ సినిమాలోని విజువల్స్ గురించి ఇప్పటికే చాలా మంది ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ అప్ డేట్స్ గురించి ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











