Akhanda 2: అఖండ 2కు మరో అడ్డంకి.. ఆ విషయంపై హైకోర్టులో పిటిషన్..

Akhanda 2: టాలీవుడ్‌ యాక్టర్‌ నందమూరి బాలకృష్ణ (Balakrishna), బోయ‌పాటి శీను (Boyapati srinu) కాంబోలో వస్తోన్న సీక్వెల్ ప్రాజెక్ట్‌ 'అఖండ 2: తాండవం' (Akhanda 2). ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి డిసెంబర్ 5నే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ, ఈ సినిమా సాంకేతిక సమస్యల కారణంగా వాయిదా పడింది. అనంతరం సినీ పెద్దలు మధ్యవర్తిత్వం చేసి సమస్యలను పరిష్కరించడంతో, కొత్త రిలీజ్ తేదీగా డిసెంబర్ 12న విడుదల కాబోతుంది. ఇదే సమయంలో డిసెంబర్ 11న ప్రీమియర్ షోలను కూడా ఏర్పాటు చేశారు. ఈ తరుణంలో సినిమా మళ్లీ వివాదాల్లో చిక్కుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే?

తెలంగాణ ప్రభుత్వం తాజాగా అఖండ-2 కోసం టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జారీ చేసిన జీఓ ప్రకారం సింగిల్ స్క్రీన్‌లలో టికెట్‌కు అదనంగా రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ. 100 వరకు పెంచుకునే వీలు కల్పించారు. అంతేకాదు, ప్రీమియర్ షో కోసం టికెట్ ధరను రూ. 600గా నిర్ణయించారు. పెరిగిన ధరలు డిసెంబర్ 12 నుంచి 14వ తేదీ వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. అయితే ఈ అనుమతితో పాటు ప్రభుత్వం ఒక కీలక నిబంధన పెట్టింది. టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20% ను సినీ కార్మికుల సంక్షేమ నిధికి కేటాయించాలి. ఈ నిర్ణయం ఇండస్ట్రీలో మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ, టికెట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయనే విమర్శలు సోషల్ మీడియాలో చర్చనీయంగా మారాయి.

Akhanda 2 Ticket Hike Row Telangana High Court Takes Up Petition Against Govt GO

ఇదిలా ఉండగా, టికెట్ ధరల పెంపుపై న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం జారీ చేసిన టికెట్ ధరల పెంపు జీఓను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కోర్టు టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోలు నిర్వహణ అంశాలపై విచారణ జరపనుంది. దీంతో చిత్ర బృందంలో ఉత్కంఠ నెలకొంది.

ఇక అఖండ-2 రిలీజ్ వాయిదా పడటంతో 16 చిన్న సినిమాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. డిసెంబర్ 12న విడుదలై మంచి స్క్రీన్లు దక్కుతాయని భావించి తేదీని ఫిక్స్‌ చేసిన చిన్న సినిమాలకు భారీ నష్టం వాటిల్లే అవకాశముంది. అఖండ 2 మాస్ క్రేజ్ దృష్ట్యా, ఎక్కువ థియేటర్లు అదే సినిమాకు కేటాయించబడుతాయని సినిమా వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో చిన్న సినిమాల నిర్మాతలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

చిత్రానికి సంబంధించిన మరో కీలక అంశం తాజాగా విడుదలైన టీజర్ ఇప్పటికే యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డులు సృష్టిస్తోంది. బాలకృష్ణ పవర్‌ఫుల్ లుక్, బోయపాటి డైరెక్షన్, థండరస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్ని అఖండ 2పై హైప్ మరింత పెరిగింది. అదిపినిశెట్టి విలన్‌గా నటించగా, హర్షాలి మల్హోత్రా, పూర్ణ కీలక పాత్రల్లో నటించారు. అయితే, టికెట్ ధరల పెంపుపై కోర్టు విచారణ రావడం సినిమారిలీజ్‌పై ప్రభావం చూపుతుందా? ప్రత్యేక షోలు కొనసాగుతాయా? టికెట్ ధరలను తగ్గించే అవకాశం ఉందా? అన్నదానిపై చర్చ మొదలైంది.

గతంలో పవన్ కళ్యాణ్ 'OG' సినిమాకు ఇచ్చిన ధరల పెంపు జీఓను హైకోర్టు సస్పెండ్ చేసిన సందర్భం ఉండటంతో, ఈ కేసు కూడా ఆసక్తిగా మారింది. మొత్తం మీద, అఖండ 2 విడుదలకు గంటలు మాత్రమే ఉండగా, ఈ లీగల్ ట్విస్ట్ సినిమా బజ్‌ను మరింత పెంచింది. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా హైకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X