Balakrishna's birthday Akhanda poster: బాలయ్య న్యూ స్టైలిష్ లుక్.. ఫ్యాన్స్‌కు పూనకం వచ్చేలా..
నందమూరి బాలకృష్ణ హై వోల్టేజ్ మాస్ మూవీ అఖండ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్ తో అంచనాలు ఏ రేంజ్ లో పెరిగాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సింహా, లెజెండ్ సినిమాల అనంతరం బోయపాటి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడం వలన సినిమాకు సంబంధించిన ప్రతి విషయం వైరల్ అవుతోంది. ఇక పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందే పవర్ఫుల్ పోస్టర్ ను విడుదల చేశారు.
Recommended Video

అఖండ విజయాన్ని అందుకునేలా
గతంలో ఎప్పుడు లేని విధంగా బాలకృష్ణ అఘోరా పాత్రలో కనిపిస్తుండడం వలన సినిమాపై ఒక్కసారిగా బజ్ పెరిగిపోయింది. చూస్తుంటే సింహా లెజెండ్ సినిమాల కంటే హై రేంజ్ లో అఖండ విజయాన్ని అందుకునేలా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా చిత్ర యూనిట్ హై లెవెల్లోనే ఆలోచిస్తోంది.

బర్త్ డే స్పెషల్ పోస్టర్
జూన్ 10న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో తప్పకుండా సినిమాలకు సంబంధించిన ఎదో ఒక సర్ ప్రైజ్ ఉంటుందని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఇక అందరూ ఎదురుచూస్తున్నట్లుగానే అనుకున్న సమయానికి బోయపాటి శ్రీనివాస్ అద్భుతమైన పోస్టర్ ను వదిలారు.

మరోసారి బాక్సాఫీస్ బద్దలే..
బాలకృష్ణ నెవర్ బిఫోర్ అనేలా కనిపించడంతో బాక్సాఫీస్ మరోసారి బద్దలవ్వడం కాయమని చెప్పవచ్చు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని బాలకృష్ణతో పాటు బోయపాటి కూడా చాలా కష్టపడి వర్క్ చేస్తున్నారు. ముఖ్యంగా బోయపాటి ఆశలన్నీ కూడా అఖండ పైనే ఉన్నాయి. ఎందుకంటే ఆయన చివరి సినిమా వినయ విధేయ రామ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే.

రెండు విభిన్నమైన పాత్రలతో..
ఇక అఖండ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలతో మెప్పించనున్నట్లు తెలుస్తోంది. అయితే అందరి చూపు కూడా అఘోరా పాత్ర పైనే ఉంది. తప్పకుండా ఆ పాత్రకు సంబంధించిన సీన్స్ వెండితెరపై విజువల్ ట్రీట్ ను ఇస్తుందని అంటున్నారు. ఇక ఆ సినిమా అనంతరం బాలకృష్ణ గోపీచంద్ మలినేని సినిమాతో బిజీ కానున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











