బాలయ్య అంటే భయం… ఆయన ప్రవర్తనతో షాకయ్యా.. హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్!
నటసింహ నందమూరి బాలకృష్ణ చాలా రోజులుగా హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. చివరిగా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో హిట్ అందుకున్న ఆయన మరో హిట్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే తనకు రెండు సూపర్ హిట్ సినిమాలు అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన ఇప్పుడు అఖండ అనే సినిమా చేస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా కారణంగా సినిమా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ సినిమా మొదటి నుంచి కూడా హీరోయిన్స్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.
చివరిగా కంచె భామ ప్రగ్యా జైస్వాల్ బాలయ్య సరసన హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ భామ బాలకృష్ణ కు సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాలకృష్ణ గారితో పనిచేయడం చాలా అద్భుతంగా ఉంది అని పేర్కొన్న ప్రగ్యా జైస్వాల్ సెట్ లో ఉన్నప్పుడు ఆయన ఒక పవర్ హౌస్ లాగా పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తారు అని చెప్పుకొచ్చింది. ఈ సినిమా సెట్లోకి అడుగు పెట్టక ముందు వరకూ ఆయన గురించి చాలా విన్నాను అని అలా వినడంతో ఆయన గురించి భయం వేసింది అని చెప్పుకొచ్చింది.

కానీ ఒక్కసారి ఆయన సెట్స్ లోకి అడుగుపెట్టాక మాతోపాటు చిన్నపిల్లాడిలా జోక్స్ చెబుతూ చాలా సరదాగా ఉండటం చూసి ఆశ్చర్యం వేసింది అని ఒక రకంగా ఆయన అందరితో కలిసి పోవడం చూసి షాక్ అయ్యానని ఆమె చెప్పుకొచ్చింది. ఇక బాలకృష్ణతో ఆమెకు ఇది మొదటి సినిమానే అయినా బోయపాటితో ఆమె గతంలో ఒక సినిమా చేసింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన జయ జానకి నాయక సినిమాలో ఆమె ఒక పాత్రలో నటించింది. ఇక ఈ సినిమా షూటింగ్ 12వ తేదీ నుంచి హైదరాబాదులో చేయాలని భావించారు కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా వేశారు.


Click it and Unblock the Notifications











