Maha Shivaratri 2023: థియేటర్లలో మళ్లీ ఈ హిట్ సినిమాలు.. ప్రత్యేక ప్రదర్శన.. ఎప్పుడు? ఎందులో అంటే?

హీరోలంటే వాళ్ల అభిమానులకు ఎనలేని క్రేజ్, పిచ్చి ప్రేమ. అందుకే వాళ్ల సినిమాల కోసం ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. అలాగే వాళ్ల లైఫ్ కెరీర్ లో బాగా హిట్ అయిన సినిమాలను థియేటర్లలో మళ్లీ మళ్లీ చూడాలనుకుంటారు. అందుకోసం ఇటీవల రీ రిలీజ్ ట్రెండ్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే. తమ అభిమాన హీరోల సూపర్ హిట్ సినిమాలను ఒక స్పెషల్ డే రోజున థియేటర్లలో మళ్లీ ప్రదర్శిస్తున్నారు.

అయితే మిగతా పండుగల్లా కాకుండా మహా శివరాత్రికి మాత్రం వివిధ హీరోల సినిమాలను రాత్రి పూట ప్రదర్శిస్తుంటారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఏడాది ఫిబ్రవరి 18న మహా శివరాత్రి సందర్భంగా హైదరాబాద్ లో ఏ హీరో సినిమా? ఏ థియేటర్ లో? ఎప్పుడు ప్రదర్శిస్తారో? ఓ లుక్కేద్దామా!

అఖండ

అఖండ

నందమూరి నటసింహ బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీళ్ల కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజండ్ ఎంతపెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. అయితే గతేడాది వచ్చిన అఖండ అంతకుమించిన హిట్ కొట్టింది.

ఈ సినిమాను మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 18న హైదరాబాద్ లోని సుదర్శన్ 35 ఎమ్ఎమ్ థియేటర్ లోఅర్ధ రాత్రి 12.15 గంటలకు, సుష్మ 70 ఎమ్ఎమ్ థియేటర్ లో రాత్రి 11.49 గంటలకు ప్రదర్శించనున్నారు.

వాల్తేరు వీరయ్య

వాల్తేరు వీరయ్య

వింటేజ్ లుక్ లో మెగాస్టార్ చిరంజీవి అదరగొట్టిన చిత్రం వాల్తేరు వీరయ్య. కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ కొల్లి-చిరంజీవి-మాస్ మహారాజా రవితేజ వంటి క్రేజీ కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్ కొట్టిన చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాను మహా శివరాత్రి సందర్భంగా చిరు, రవితేజ అభిమానుల కోసం మళ్లీ ప్రదర్శించనున్నారు. ఫిబ్రవరి 18న సంధ్య 70 ఎమ్ఎమ్ లో అర్థ రాత్రి 12.15 నిమిషాలకు, అలాగే ఉదయం 3 గంటలకు ప్రదర్శించనున్నారు.

పుష్ప: ది రైజ్

పుష్ప: ది రైజ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మూవీ పుష్ప. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా శ్రీవల్లిగా అలరించిన ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ చిత్రాన్ని మహా శివరాత్రి రోజును పురస్కరించుకుని ఫిబ్రవరి 18న హైదరాబాద్ లోని సుష్మ 70 ఎమ్ఎమ్ థియేటర్ లో ఉదయం 3 గంటలకు షో వేయనున్నారు.

కాంతార

కాంతార

కన్నడ నాట చిన్న సినిమాగా విడుదలైన కాంతార సినిమా దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అందుకుంది. హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలీంస్ నిర్మించింది. సప్తమి గౌడ హీరోయిన్ గా నటించిన కాంతార సినిమాను మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 18 అంటే శనివారం రోజున హైదరాబాద్ లోన సప్తగిరి 70 ఎమ్ఎమ్ థియేటర్ లో అర్థరాత్రి 12 గంటలకు, ఉదయం 3 గంటలకు స్క్రీనింగ్ చేయనున్నట్లు సమాచారం.

టెంపర్

టెంపర్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, డ్యాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వంటి క్రేజీ కాంబినేషన్ లో రెండోసారి వచ్చిన మూవీ టెంపర్. ఒక కరప్టెడ్ పోలీస్ నిజాయితీగా మారితే ఎలా ఉంటుందో వంటి కథాంశంతో వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. ఈ సినిమాలో మొదటిసారిగా సిక్స్ ప్యాక్ కనిపించి అలరించాడు తారక్. ఈ చిత్రాన్ని మహా శివరాత్రి సందర్భంగా దేవి 70 ఎమ్ఎమ్ లో అర్థరాత్రి 12.15 గంటలకు, సంధ్య 35 ఎమ్ఎమ్ లో అర్థరాత్రి 12.30 గంటలకు షో వేయనున్నారు.

రెబల్-సరిలేరు నీకెవ్వరు

రెబల్-సరిలేరు నీకెవ్వరు

మిస్టర్ పర్ఫెక్ట్ వంటి మంచి హిట్ కొట్టిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తర్వాత చేసిన సినిమా రెబల్. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు దివంగత నటుడు కృష్ణంరాజు కూడా నటించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం చవిచూసింది. అయితే ఇప్పుడు ప్రభాస్ అభిమానుల కోసం ఫిబ్రవరి 18న హైదరాబాద్ లోని సంధ్య 35 ఎమ్ఎమ్ లో ఉదయం 3 గంటలకు ప్రదర్శించనున్నారు. అలాగే మహేశ్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో పాటు మరికొన్ని చిత్రాలను ప్రదర్శించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X