అఖిల్ ఏజెంట్ నిర్మాత ఇంట్లో విషాదం.. అనిల్ సుంకర ఎమోషనల్ పోస్ట్!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని నిర్మాతల్లో అనిల్ సుంకర ఒకరు. మొదట 14 రీల్స్ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై అనేక చిత్రాలను నిర్మించిన ఆయన ప్రస్తుతం కాలంలో ఏకే ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తున్నారు. మంచు మనోజ్ నటించిన బిందాస్ మూవీతో సినిమాలు నిర్మించడం మొదలు పెట్టిన ఆయన యాక్షన్ 3D సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. ఇక ఇప్పుడు అక్కినేని అఖిల్ హీరోగా ఏజెంట్ సినిమాను నిర్మిస్తూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే తాజాగా ఆయన ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.
సురేందర్ రెడ్డి డైరెక్షన్ : అక్కినేని అఖిల్ హీరోగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ నటించిన చిత్రం మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్. ఈ సినిమా తర్వాత అఖిల్ చేసిన మూవీ ఏజెంట్. ఏకే ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మించిన ఈ మూవీకి సురేందర్ రెడ్డి వహించారు. ఇందులో అఖిల్ కు జోడీగా బ్యూటిఫుల్ సాక్షి వైద్య హీరోయిన్ గా చేయగా.. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ సంగీతం అందించాడు.

మరికొన్ని రోజుల్లో : ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సీన్స్ ఉన్నాయని ప్రశంసలు వస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా విడుదల కానుండగా జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది మూవీ టీమ్.
ఇంట్లో విషాదం : ఇదిలా ఉంటే ఇటీవల ఏప్రిల్ 21న నటుడు మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ మరణించిన విషయం తెలిసిందే. తాజాగా నిర్మాత అనిల్ సుంకర ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన పెదనాన్న సుంకర బసవరావు శనివారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని అనిల్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

ప్రేమించే వ్యక్తి : "నన్ను ఎంతగానో ప్రేమించే వ్యక్తి. అన్ని రకాలుగా నన్ను ప్రోత్సహిస్తూ నా విజయానికి బాటలు వేసినా నా పెదనాన్న ఇక లేరనే వార్త నన్ను ఎంతగానో బాధిస్తుంది. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతాం. కష్టపడి సక్సెస్ సాధిస్తూ గర్వించేలా చేస్తాం. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి" అని నిర్మాత అనిల్ సుంకర ఎమోషనల్ గా ట్వీట్ చేశారు.
నిర్మాణం.. దర్శకత్వం : ఇదిలా ఉంటే అనిల్ సుంకర్ మొదట్లో 14 రీల్స్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై నమో వెంకటేశ, 1 నేనొక్కడినే, లెజెండ్, ఆగడు, కృష్ణగాడి వీర ప్రేమ గాథ, హైపర్, లై మొదలైన సినిమాలను నిర్మించారు. తర్వాత ఏకే ఎంటర్టైన్ మెంట్స్ పేరుతో బిందాస్, ఆహా నా పెళ్లంట, యాక్షన్ 3D, జేమ్స్ బాండ్, రన్, ఈడోరకం ఆడోరకం, ఈడు గోల్డెహే, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు, కిరాక్ పార్టీ, రాజుగాడు, సీత, చాణక్య, సరిలేరు నీకెవ్వరు, మహా సముద్రం చిత్రాలు ప్రొడ్యూస్ చేశారు. వీటిలో యాక్షన్ 3D మూవీకి దర్శకత్వం కూడా వహించారు అనిల్ సుంకర.


Click it and Unblock the Notifications











