twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Agent Movie: అక్కినేని ఫ్యాన్స్‌కు మరో షాక్.. ఏజెంట్ వచ్చేది అప్పుడే కాదట

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలోని పాత తరం నుంచి నేటి స్టార్ హీరోల వరకూ ఎంతో మంది తమ వారసులను హీరోలుగా పరిచయం చేశారు. అయితే, అందులో కొందరు మాత్రమే తమదైన మార్కును చూపించి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. కానీ, కొందరు మాత్రం చాలా కాలం పాటు విజయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటి వారిలో అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ ఒకడు. చిన్నప్పుడే 'సిసింద్రీ' సినిమాలో మెరిసిన అతడు.. కొన్నేళ్ల క్రితమే 'అఖిల్' అనే మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. కానీ, ఇది అఖిల్‌కు గ్రాండ్ ఎంట్రీని ఇవ్వలేదు. ఆ తర్వాత 'హలో', 'మిస్టర్ మజ్నూ' చేసినా ఈ యంగ్ హీరోకు నిరాశే ఎదురైంది. దీంతో అతడి భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.

    Telugu Indian Idol: విజేతగా వాగ్దేవి.. ప్రైజ్‌మనీతో పాటు చిరంజీవి ఆఫర్.. ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే!Telugu Indian Idol: విజేతగా వాగ్దేవి.. ప్రైజ్‌మనీతో పాటు చిరంజీవి ఆఫర్.. ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే!

    హీరోగా పరిచయం అయిన తర్వాత చాలా కాలం పాటు అఖిల్‌కు ఒక్కటంటే ఒక్క హిట్ కూడా దక్కలేదు. దీంతో అతడి కెరీర్‌ అర్థాంతరంగా ముగుస్తుందని అంతా భ్రమపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యంగ్ హీరో గత ఏడాది 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో ఆశల నడుమ భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీతో అతడు తొలిసారి విజయాల బాట పట్టాడు. దాదాపు రూ. 19 కోట్ల టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ.. మంచి స్పందనతో రూ. 23 కోట్లకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. దీంతో రూ. 4 కోట్లకు పైగా లాభాలు కూడా వచ్చాయి. ఈ ఉత్సాహంతోనే అఖిల్ తన ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు.

    Akhil Akkineni Agent Movie Postponed to Dussehra

    అక్కినేని అఖిల్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల్లో 'ఏజెంట్' ఒకటి. టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ మూవీ షూటింగ్ గత ఏడాది ప్రారంభం అయింది. ఇందులో అక్కినేని అఖిల్ రా ఏజెంట్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అతడు ఎన్నో విద్యల్లో శిక్షణను కూడా తీసుకున్నాడు. అదే సమయంలో ఫిజిక్‌ విషయంలోనూ వైవిధ్యాన్ని చూపించేందుకు బల్క్ బాడీతో రెడీ అయ్యాడు. కొద్ది రోజుల క్రితమే అతడి సిక్స్ ప్యాక్‌ను చూపిస్తూ రెండు పోస్టర్లను విడుదల చేశారు. దీంతో ఈ చిత్రంపై ఆదిలోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

    హీరోయిన్ హాట్ ఫొటో షేర్ చేసిన వర్మ: ఇలాంటిది నా జీవితంలో చూడలేదంటూ ట్వీట్హీరోయిన్ హాట్ ఫొటో షేర్ చేసిన వర్మ: ఇలాంటిది నా జీవితంలో చూడలేదంటూ ట్వీట్

    క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'ఏజెంట్' మూవీ షూటింగ్ సజావుగా సాగడం లేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందన్న టాక్ కూడా వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్‌ను ఇటీవలే పున: ప్రారంభించారు. దీంతో అంతా సవ్యంగానే అవుతుందని ఫ్యాన్స్ అనుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని అగస్టు 12న విడుదల చేయడం లేదట. అంతేకాదు, ఈ మూవీని దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని తెలుస్తోంది.

    అఖిల్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'ఏజెంట్' మూవీ విదేశీ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోందట. దీంతో అఖిల్ రోల్ పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక, ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత, డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్‌హాప్ తమీజా సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

    English summary
    Young Hero Akhil Akkineni Now Doing AGENT Movie Under Surender Reddy Direction. This Movie Will Postponed to Dussehra.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X