Agent: అఖిల్‌కు అమిత్ షా దెబ్బ.. RRR హీరోలు కీలక నిర్ణయం.. ఏజెంట్‌కు ఊహించని షాక్

టాలీవుడ్‌లో కూడా స్టార్ల వారసులు చాలా మందే హీరోలుగా పరిచయం అయ్యారు. కానీ, అందులో కొందరు మాత్రమే ఆరంభంలోనే సక్సెస్‌ అవగా.. మరికొందరు మాత్రం చాలా కాలం పాటు కష్టాలను ఎదుర్కొన్నారు. అందులో అక్కినేని వారసుడు అఖిల్ ఒకడు.

దాదాపు మూడు సినిమాలు చేసినా విజయాన్ని అందుకోలేకపోయిన అతడు.. నాలుగో దానితో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు అఖిల్ 'ఏజెంట్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ విషయం దెబ్బ పడింది. వివరాల్లోకి వెళ్తే...

Akhil Akkineni Agent Movie Pre Release Event on April 23rd

ఏజెంట్‌గా మారిపోయిన అఖిల్: స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపకల్పనలో అక్కినేని అఖిల్ నటించిన సినిమానే 'ఏజెంట్'. ఇందులో సాక్షి వైద్య హీరోయిన్‌‌గా, మమ్ముట్టి మరో కీలక పాత్ర చేస్తున్నారు. దీన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మించారు. వక్కంతం వంశీ కథను ఇచ్చాడు. హిప్‌హాప్ తమీజా మ్యూజిక్ అందించాడు.

ఎన్నో బ్రేకులు.. రిలీజ్ లేట్‌గా: అక్కినేని అఖిల్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందిన 'ఏజెంట్' మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, మధ్యలో కొన్ని అనుకోని అవాంతరాలు ఎదురు కావడంతో చిత్రీకరణ సజావుగా సాగలేదు. దీంతో ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడింది. ఫలితంగా మూవీ బడ్జెట్ కూడా భారీగానే పెరిగిపోయింది.

Akhil Akkineni Agent Movie Pre Release Event on April 23rd

రిలీజ్‌కు రెడీ... ప్రమోషన్స్‌తో: అక్కినేని అఖిల్ నటించిన 'ఏజెంట్' మూవీ ఏప్రిల్ 28న విడుదల కాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసేసింది. ఇప్పటికే పలు ఈవెంట్లను కూడా నిర్వహించారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులుగా ఈ సినిమా హడావిడే కనిపిస్తోంది. ఇక, ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయాలనుకుని.. తెలుగులోనే తీసుకొస్తున్నారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్: క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఏజెంట్' మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసేశారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 23న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. దీన్ని వరంగల్‌లోని రంగలీలా మైదానంలో సాయంత్రం 5 గంటల నుంచి నిర్వహించబోతున్నారు. దీనికోసం ఎంతో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Akhil Akkineni Agent Movie Pre Release Event on April 23rd

ఈవెంట్‌కు RRR హీరోలు రాక: ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న 'ఏజెంట్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్టులు ఎవరు వస్తారన్న దానిపై చాలా రోజుల క్రితమే ఓ న్యూస్ లీకైంది. ఈ కార్యక్రమానికి అఖిల్‌కు ఎంతో సన్నిహితులైన RRR మూవీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ముఖ్య అతిథులుగా వస్తారని తెలిసింది. దీంతో ఈ ఈవెంట్‌పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

ఏజెంట్‌కు అమిత్ షా దెబ్బ: ముందు నుంచీ ప్రచారం అవుతోన్నట్లుగానే 'ఏజెంట్' ఈవెంట్‌కు ఎన్టీఆర్, చరణ్ రావాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. అయితే, ఏప్రిల్ 23నే కేంద్ర మంత్రి అమిత్ షా‌తో ఈ హీరోలతో పాటు RRR యూనిట్ సభ్యులు హైదరాబాద్‌లో సమావేశం కాబోతున్నారు. ఈ కారణంగా చివరి నిమిషంలో ఎన్టీఆర్, చరణ్ 'ఏజెంట్' ఈవెంట్‌కు రాలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

Akhil Akkineni Agent Movie Pre Release Event on April 23rd

గెస్టులు లేకుండానే ఈవెంట్: అటు ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ ఇద్దరూ 'ఏజెంట్' ఈవెంట్‌కు హాజరు కాలేకపోతోన్నారు. దీంతో చిత్ర యూనిట్ గెస్టులు లేకుండానే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తుందని తెలుస్తోంది. అందుకే తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో ఏ స్టార్ పేరును కానీ, ఫొటోను కానీ వేయలేదని అంటున్నారు. మరి ఈ కార్యక్రమానికి అక్కినేని ఫ్యామిలీ నుంచైనా ఎవరైనా వస్తారేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X