AGENT Movie: అక్కినేని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. డేట్ ఫిక్స్ చేసుకున్న అఖిల్
టాలీవుడ్‌లోకి ఎంతో మంది స్టార్లు తమ పిల్లలను హీరోలుగా పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే, అలా వచ్చిన వారిలో చాలా మంది తమదైన టాలెంట్లను చూపించి సత్తా చాటారు. కొందరు మాత్రం ఎంతో కాలం పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందులో అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ ఒకడు. చిన్నప్పుడే 'సిసింద్రీ' సినిమాలో మెరిసిన అతడు.. కొన్నేళ్ల క్రితమే 'అఖిల్' అనే మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. కానీ, ఇది అఖిల్‌కు గ్రాండ్ ఎంట్రీని ఇవ్వలేదు. ఆ తర్వాత 'హలో', 'మిస్టర్ మజ్నూ' చేసినా ఈ యంగ్ హీరోకు నిరాశే ఎదురైంది. దీంతో అతడి కెరీర్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత విజయాన్ని సొంతం చేసుకోలేకపోయిన అఖిల్.. రెండేళ్ల క్రితమే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో ఆశల నడుమ భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీతో అతడు తొలిసారి విజయాల బాట పట్టాడు. దీంతో అప్పటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ వెంటనే 'ఏజెంట్' అనే పాన్ ఇండియా చిత్రాన్ని కూడా మొదలు పెట్టేశాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా స్పై థ్రిల్లర్ స్టోరీతో రాబోతుంది. దీంతో ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'ఏజెంట్' మూవీ షూటింగ్ సజావుగా సాగడం లేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందన్న టాక్ కూడా వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్‌ను ఇటీవలే పున: ప్రారంభించారు. ఇలా ఇప్పటి వరకు చాలా వరకు షూట్‌ను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ వివరాలు బయటకు వచ్చాయి. ఫిలిం నగర్ సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని వచ్చే ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని కూడా టాక్ వినిపిస్తోంది.
'ఏజెంట్' మూవీలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కూడా నటిస్తున్నారు. దీన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత, డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్‌హాప్ తమీజా సంగీతాన్ని ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











