AGENT Movie: స్పెషల్ డేనే ఏజెంట్ రిలీజ్.. అండర్‌వేర్‌తో షాకిచ్చిన అఖిల్
టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి హ్యాండ్సమ్ లుక్స్‌తో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు అఖిల్. అయితే, అతడికి హీరోగా సరైన ఆరంభం మాత్రం దక్కలేదు. అంతేకాదు, ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు కూడా పరాజయం పాలయ్యాయి. దీంతో ఈ యంగ్ హీరో కెరీర్‌పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో రెండేళ్ల క్రితమే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి హిట్‌ను కొట్టాడు.
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సక్సెస్ తర్వాత ఫుల్ జోష్‌లో ఉన్న అక్కినేని అఖిల్... ఆ వెంటనే 'ఏజెంట్' అనే పాన్ ఇండియా చిత్రాన్ని కూడా మొదలు పెట్టేశాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా స్పై థ్రిల్లర్ స్టోరీతో రాబోతుంది. దీంతో ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అయితే, మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురు కావడంతో ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడిపోయింది. దీంతో అసలు ఇది మొత్తానికే ఆగిపోయిందని కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా అఖిల్ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది.

స్టైలిష్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఏజెంట్' మూవీ ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ తేదీ టాలీవుడ్‌కు ఎంతో ప్రత్యేకమైనదిగా చెబుతుంటారు. గతంలో ఇదే రోజున వచ్చిన ఎన్నో చిత్రాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక, కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో అక్కినేని అఖిల్ రక్తం కారుతోన్న ముఖంతో ఎంతో వైల్డుగా కనిపించాడు. దీంతో అతడి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతోన్నారు.
క్రేజీ కాంబోలో వస్తున్న 'ఏజెంట్' మూవీలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్ర చేస్తున్నారు. దీన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందించాడు. హిప్‌హాప్ తమీజా సంగీతాన్ని ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











