AGENT: మరో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న అఖిల్.. వైల్డ్ లుక్కుతో మరింత కిక్ ఇచ్చాడుగా..

అఖిల్ అక్కినేని గత కొంత కాలంగా మాస్ ప్రేక్షకులను యాక్షన్ ప్రియులను కూడా మెప్పిమ్చాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు. అయితే మొదట అతను చేసిన అఖిల్ ప్రయోగం డిజాస్టర్ గా నిలవడంతో ఆ తర్వాత ఎక్కువగా ప్రేమకథలను చేయాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు మాత్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న ఏజెంట్ సినిమా అయితే పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని ఓ వర్గం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు అఫీషియల్ గా మరొక డేట్ ను అనౌన్స్ చేసేసారు. అంతే కాకుండా మరొక పవర్ఫుల్ పోస్టర్ ను కూడా విడుదల చేయడంతో అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

యాక్షన్ ఫిల్మ్

యాక్షన్ ఫిల్మ్

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో గత కొంత కాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరోలలో అఖిల్ అక్కినేని ఒకరు. గత ఏడాది విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. అయితే మొదటి నుంచి కూడా అఖిల్ ఎక్కువగా మాస్ యాక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న ఏజెంట్ సినిమా మాస్ యాక్షన్ ఫిల్మ్ గా ఉండబోతోందని అర్థమవుతుంది.

పవర్ఫుల్ ఏజెంట్..

పవర్ఫుల్ ఏజెంట్..

ఏజెంట్ సినిమాలో మొదటిసారి అక్కినేని అఖిల్ చాలా విభిన్నమైన బాడీ లాంగ్వేజ్ టెజో కనిపించబోతున్నాడు. అతను ఫిట్నెస్ విషయంలో కూడా భారీ మార్పులు చేయడం విశేషం. ఈ సినిమాలో అతను ఒక ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. దేశం కోసం విదేశాలకు వెళ్లి అక్కడ టెర్రర్ ను ఎలా ఎదుర్కొన్నాడు అనే కోణంలో సినిమా చాలా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని భారత గూఢచారి గా అఖిల్ చేసే సాహసాలు ఈ సినిమాలో హైలెట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది.

 ప్రత్యేక పాత్రలో మమ్ముట్టి

ప్రత్యేక పాత్రలో మమ్ముట్టి

ఏజెంట్ సినిమాలో మరొక ముఖ్యమైన పాత్రలో మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన కూడా ఒక పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల హైదరాబాదులో మొదలైన షెడ్యూల్ లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది.

సైరా అనంతరం..

సైరా అనంతరం..

తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా యాక్షన్ సినిమాలను చేసి చాలా కాలమైంది. సైరా సినిమా అనంతరం ఆయన అఖిల్ అక్కినేనితో సినిమా చేస్తాడని ఎవరూ ఊహించలేదు. అయితే ఏజెంట్ కథకు అఖిల్ అయితేనే కరెక్ట్ గా సరిపోతాడు అని సురేందర్ రెడ్డి ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడట.

న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్

న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్

అయితే ఈ సినిమా మొత్తానికి మరొక విడుదల తేదీ ఫిక్స్ చేసుకుంది. అసలైతే గత ఏడాది డిసెంబర్లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా ఆగస్టు 12 వ తేదీన విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు అఫీషియల్ గా ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఆగస్టు 15వ తేదీ కూడా ఈ సినిమాకు కలిసొచ్చే అవకాశం ఉంటుంది. సినిమాలో దేశ భద్రతకు సంబంధించిన ఆర్మీ అంశాలు కూడా ఉంటాయి కాబట్టి అదే సరైన డేట్ అని చిత్ర యూనిట్ సభ్యులు ఫిక్స్ అయ్యారు.

Recommended Video

Akhil With Girl Fans | Lady Fans Funny Questions | Most Eligible Bachelor
అఖిల్ హై వోల్టేజ్ లుక్

అఖిల్ హై వోల్టేజ్ లుక్

ఇక చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ లో అయితే అఖిల్ అక్కినేని హై వోల్టేక్ లుక్ లో కనిపిస్తున్నాడు. ద వైల్డ్ వన్ అనే ట్యాగ్ తో అఖిల్ చేతిలో మిషన్ గన్ పట్టుకొని చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. చూస్తుంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసేలా ఉన్నాడు. ఇక ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను రామ్ బ్రహ్మం సుంకర అలాగే సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X