Akhil Akkineni: ఏజెంట్ రన్ టైమ్ ఫిక్స్.. సినిమాలో ఆ 15 నిమిషాలు అరాచకం!
అక్కినేని యువ హీరో అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ ఏజెంట్ మూవీ ఏప్రిల్ 28న రిలీజ్ కాబోతోంది. భారీ బడ్జెట్ తో అనిల్ సుంకర ఈ మూవీని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం సందడిగా జరుగుతున్నాయి. మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని అఖిల్ అక్కినేని చాలా కసిగా ఉన్నాడు.
ఈ నేపధ్యంలోనే సినిమాలో చేసిన ఫీట్ లు ప్రమోషన్స్ లో కూడా చేస్తూ ఉన్నాడు. కాకినాడ వేదికగా ఏజెంట్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుంది. అదే రోజు ట్రైలర్ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని టాక్. భారీ యాక్షన్ సీక్వెన్స్ హైవోల్టేజ్ లో ఈ మూవీని సురేందర్ రెడ్డి తెరపై ఆవిష్కరించారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబందించిన రన్ టైమ్ ని లాక్ చేసినట్లు తెలుస్తోంది.

మొత్తం 2:30 గంటల నిడివితో ఏజెంట్ మూవీ ఉండబోతోందంట. మూవీలో ప్రతి ఎపిసోడ్ నెక్స్ట్ లెవల్ అన్నట్లు ఉంటుందని టాక్. అఖిల్ యాక్షన్ సీక్వెన్స్ అయితే ప్రేక్షకులు విజిల్స్ వేసేలా ఉంటాయంట. ఇంటర్వెల్ బ్యాంగ్ మూవీకి చాలా హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది. అదిరిపోయే ట్విస్ట్ లు కూడా మూవీలో ఆసక్తి పెంచే విధంగా ఇన్ సైడ్ టాక్.
ఇక క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవల్ అనే టాక్ వినిపిస్తోంది. మొదటి సారి అఖిల్ ఈ మూవీ కోసం అద్భుతమైన సాహసాలు చాలా రియలిస్టిక్ గా చేసాడని టాక్. కచ్చితంగా ఏజెంట్ మూవీతో అఖిల్ కి స్టార్ ఇమేజ్ రావడం పక్కా అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఏది ఏమైనా సురేందర్ రెడ్డి అంటేనే యాక్షన్ సీక్వెన్స్, స్క్రీన్ ప్లే సరికొత్తగా ఉంటాయి.
ఈ మూవీలో మరిసారి తన మార్క్ ని చూపించబోతున్నాడు అని తెలుస్తోంది. రా ఏజెంట్ గా అఖిల్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తాడని చిత్ర యూనిట్ నుంచి టాక్ బయటకి వస్తోంది. మరి ఏప్రిల్ 28న ఏజెంట్ మూవీతో అఖిల్ ఎలాంటి అద్భుతం చేస్తాడనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











