Akhil Akkineni: పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టిన అఖిల్.. రక్తం కారుతోన్న ఫొటోలతో క్లారిటీ
ఈ మధ్య కాలంలోనే టాలీవుడ్‌లోకి ఎంతో మంది స్టార్లు తమ కుమారులను వారసులుగా పరిచయం చేశారు. అయితే, అందులో కొందరు మాత్రం చాలా సినిమాలు చేసే వరకూ సక్సెస్ కాలేదు. అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు అక్కినేని అఖిల్. నాగార్జున కుమారుడిగా పరిచయమైన అతడు.. వరుసగా 'అఖిల్', 'హలో', 'మిస్టర్ మజ్నూ' వంటి సినిమాలు చేశాడు. కానీ, ఇవేమీ అతడికి విజయాన్ని మాత్రం అందించలేదు. అయినప్పటికీ తన ప్రయత్నాలను మాత్రం అస్సలు మానుకోలేదు. పైగా మరిన్ని ప్రాజెక్టులను చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీంతో ఎట్టకేలకు ఒక విజయాన్ని దక్కించుకుని ఫ్యాన్స్‌లో జోష్‌ను నింపాడు.
వరుస పెట్టి సినిమాలు చేస్తూ వచ్చిన అక్కినేని అఖిల్‌కు మూడు పరాజయాలు ఇబ్బంది పెట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో ఆశల నడుమ భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీతో అతడు తొలిసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. దాదాపు రూ. 19 కోట్ల టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ఫుల్ రన్‌లో రూ. 23 కోట్లకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. దీంతో దీనికి హిట్ స్టేటస్ అందుకోవడంతో పాటు రూ. 4 కోట్లకు పైగా లాభాలు కూడా వచ్చాయి. ఈ ఉత్సాహంతోనే ఈ యంగ్ హీరో తన ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో కూడా పెట్టుకున్నాడు.
ప్రస్తుతం అక్కినేని అఖిల్.. టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' అనే సినిమాను చేస్తున్నాడు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాకు
సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ గత ఏడాది ప్రారంభం అయింది. ఇందులో అక్కినేని అఖిల్ రా ఏజెంట్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అతడు ఎన్నో విద్యల్లో శిక్షణను కూడా తీసుకున్నాడు. అదే సమయంలో ఫిజిక్ విషయంలోనూ వైవిధ్యాన్ని చూపించేందుకు బల్క్ బాడీతో తయారయ్యాడు. కొద్ది రోజుల క్రితమే అతడి సిక్స్ ప్యాక్‌ను చూపిస్తూ రెండు పోస్టర్లను విడుదల చేశారు. దీంతో దీనిపై ఆరంభంలోనే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.

'ఏజెంట్' మూవీ షూటింగ్ ప్రారంభమై చాలా రోజులే అవుతోన్నా వరుసగా బ్రేకులు రావడంతో ఇది సజావుగా సాగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా ఆగిపోయిందని కూడా ప్రచారం జరిగింది. అంతేకాదు, ఇటీవలే దీనిలో మార్పులు చేస్తున్నారని, దీంతో చాలా రోజులు విరామం ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శనివారమే ఈ మూవీ షూటింగ్‌ను పున: ప్రారంభించి పుకార్లు పుల్‌స్టాప్ పెట్టేశారు. అంతేకాదు, షూటింగ్ స్పాట్‌లో గాయాలు తగిలినట్లుగా కనిపిస్తోన్న అఖిల్ లుక్స్‌ను కూడా చిత్ర యూనిట్ షేర్ చేసింది. దీంతో ఈ చిత్రం అనుకున్న సమయానికే పూర్తి అవుతుందని అంటున్నారు. దీనిపై అక్కినేని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'ఏజెంట్' మూవీలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మిస్తున్నారు. ప్రముఖ రచయిత, డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్‌హాప్ తమీజా సంగీతం సమకూర్చుతున్నాడు.


Click it and Unblock the Notifications











